రాజ్ త‌రుణ్ కంబ్యాక్ అవుతాడా?

Last Updated on by

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ స‌న్నివేశం ఇటీవ‌ల డైలెమాలో ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఉయ్యాల జంపాల త‌ర్వాత వ‌రుస‌గా అర‌డ‌జ‌ను పైగానే సినిమాల్లో న‌టించాడు. అందులో ఉయ్యాల జంపాల‌, కుమారి 21ఎఫ్, సినిమా చూపిస్త మావ చిత్రాలు బంప‌ర్ హిట్లు కొట్టాయి. అయితే మిగ‌తా సినిమాల‌న్నీ ఫ్లాపుల‌య్యాయి. గ‌త ఏడాది వ‌రుస‌గా మూడు సినిమాలు ఫ్లాపుల‌వ్వ‌డం అత‌డి కెరీర్ ని డైలెమాలోకి నెట్టేశాయి. ఈ  స‌న్నివేశం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ఈ యంగ్ హీరో ఎలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు? అంటే.. అత‌డి ఖాతాలో ఓ రెండు సినిమాలు ప‌డ్డాయ‌ని తెలుస్తోంది.
ప్ర‌స్తుతం అత‌డు దిల్ రాజు శ్రీ‌వెంక‌టేశ్వ‌ర బ్యాన‌ర్ లో ఓ సినిమాకి సంత‌కం చేశాడు. అలాగే రానా అతిధి పాత్ర‌లో నటించే ఓ మ‌రాఠీ మూవీలోనూ న‌టించేందుకు స‌న్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా తొంద‌ర్లోనే ప్రారంభం కానుంద‌ని తెలుస్తోంది. ఇక రాజ్ త‌రుణ్ ఎలాంటి పారితోషికం లేకుండా దిల్ రాజు బ్యాన‌ర్ లో న‌టిస్తున్నాడ‌ని, సినిమా రిలీజ్ త‌ర్వాత లాభాల్లో వాటా బేసిస్ లో వ‌ర్క్ చేయ‌నున్నాడ‌ని ప్ర‌చారం అవుతోంది. మ‌రోవైపు రాజ్ త‌రుణ్ మా అసోసియేష‌న్ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేశాడు. కానీ విక్ట‌రీ వ‌రించ‌లేదు. ప్ర‌స్తుతం అత‌డు ఉన్న స‌న్నివేశంలో ఓ బంప‌ర్ హిట్ ప‌డాల్సిన ప‌రిస్థితి ఉంది. మ‌రి కంబ్యాక్ అయ్యేందుకు అత‌డు ఎలాంటి ఎత్తుగ‌డ‌లు వేస్తాడో చూడాలి. దిల్ రాజు బ్యాన‌ర్ లో గ‌తంలో ఓ ఫ్లాప్ ని అందుకోవాల్సొచ్చింది. అయినా మ‌రోసారి అత‌డితో చేతులు క‌ల‌ప‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

User Comments