శ్రీరెడ్డి డైరీ ఎంత‌వ‌ర‌కూ వ‌చ్చిందంటే?

శ్రీరెడ్డి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఒకే ఒక్క సంచ‌ల‌నం రేపి దేశ‌మంతా పాపుల‌ర్ అయిపోయింది.ఓ సినిమా న‌టిక‌న్నా ఎక్కువ పాపులారిటీ ద‌క్కించుకుంది. ట్విట‌ర్,ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్ లాంటి సోస‌ల్ మీడియా మాధ్య‌మాల్లో ఆమె ఫాలోవ‌ర్స్ మామూలుగా లేరు. స‌రిగ్గా ఆ క్రేజ్ ను కోలీవుడ్ తెలివిగా క్యాష్ చేసుకుంటోంది. టాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు అవ‌కాశాలివ్వ‌డానికి ఆలోచించినా కోలీవుడ్ మాత్రం మేమున్నామంటూ ముందుకొచ్చింది. ప్ర‌స్తుతం ఆమె జీవిత క‌థ‌కు సంబంధించిన కొన్ని అంశాల‌ను హైలైట్ చేస్తూ `రెడ్డి డైరీ` టైటిల్ తో ఓసినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో త‌న పాత్ర‌లో శ్రీరెడ్డి న‌టిస్తోంది. డాక్ట‌ర్ అల్లాదీన్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

సినిమా ప్రారంభ‌మై కొన్ని నెల‌లు గ‌డుస్తోంది. కానీ అప్ డేట్ మాత్రం రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో సినిమా ప్రొగ్ర‌స్ ఏంట‌ని ఆరాతీయ‌గా చాలా వ‌ర‌కూ షూటింగ్ పూర్త‌యిందిట‌. అలెప్పీ, గోవాలోఎక్కువ భాగం షూట్ చేసారుట‌. సినిమాల్లో అవ‌కాశం ఇప్పిస్తామ‌ని మోసం చేసిన వ్య‌క్తుల పాత్ర‌లు కూడా తెర‌పై క‌నిపించ‌నున్నాయ‌ట‌. లైంగక దోపీడి అంశాలు క‌థ‌లో ఇనిబిల్ట్ చేసారుట‌. రియ‌ల్ స్టిక్ అప్పీరియ‌న్స్ తో ఆ స‌న్నివేశా లుంటాయ‌ని స‌మాచారం. అలాగే అడ్వాన్సులిచ్చి తిరిగి తీసుకున్న నిర్మాత‌ల‌పై సెటైర్లు కూడా వేస్తున్నారుట‌. మ‌రి క‌థ‌లో ఆ స‌న్నివేశాలు ఎంత వ‌ర‌కూ రక్తి క‌డ‌తాయో తెలియాంటే రిలీజ్ వ‌ర‌కూ ఆగాల్సిందే. అన్ని ప‌నులు పూర్తిచేసి ఎప్రిల్ లో సినిమా విడుద‌ల చేయ‌నున్నార‌ని తెలిసింది.