వేర్ ఈజ్‌ వేణుమాధ‌వ్?

Last Updated on by

మిమిక్రీ ఆర్టిస్ట్ కం క‌మెడియ‌న్‌ వేణు మాధ‌వ్ ఎక్క‌డున్నాడు? అస‌లు ఏమ‌య్యాడు? తెలుగుసినీప‌రిశ్ర‌మ‌లో క‌మెడియ‌న్‌గా రెండు ద‌శాబ్ధాల పాటు ఏలిన వేణుమాధ‌వ్ .. ఉన్న‌ట్టుండి తెర‌మ‌రుగ‌య్యాడేం? అత‌డి ప్ర‌స్తుత ప‌రిస్థితేంటి? .. అస‌లు ఎలాంటి రిపోర్ట్ అన్న‌దే లేదు.

అప్ప‌ట్లో వేణుమాధ‌వ్ మ‌ర‌ణించాడంటూ ఓ పుకార్ షికారు చేసింది. ఆ పుకార్ల‌పై అత‌డు మీడియా ముందు ఓ రేంజులో ఫైర‌య్యాడు. త‌న‌పై సాగుతున్న దుష్ప్ర‌చారానికి ఎదురెళ్లి.. ధ‌ర్నాలు చేసి, కోర్టుకు వెళ్లాడు. ప‌రిశ్ర‌మ‌లో అగ్ర‌ద‌ర్శ‌కులంద‌రి సినిమాల్లో న‌టించే వేణుమాధ‌వ్ ఇటీవ‌లి కాలంలో అలా వివాదాల్లోకి వెళ్ల‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది. అయితే వేణుమాధ‌వ్ లాంటి ట్యాలెంటెడ్ క‌మెడియ‌న్ ఉన్న‌ట్టుండి ప‌రిశ్ర‌మ నుంచి దూరంగా జ‌ర‌గ‌డం అభిమానుల్లో ఆందోళ‌న క‌లిగించింది. స‌రిగ్గా రెండేళ్ల క్రితం హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్లో పుట్టిన‌రోజు సంద‌ర్భంగా సినీపాత్రికేయుల్ని క‌లిసిన వేణుమాధ‌వ్ త‌న భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల గురించి చెప్పాడు. అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తున్నాన‌ని.. పాత్ర‌లు న‌చ్చ‌డం లేద‌ని అన్నాడు. అయితే ఎందుక‌నో వేణుమాధ‌వ్‌ని ప‌రిశ్ర‌మే లైట్ తీస్కుందా? అన్న‌ది తేల‌లేదు. 2015లో రుద్ర‌మ‌దేవి, రేయ్ వంటి చిత్రాల్లో న‌టించిన వేణుమాధ‌వ్ ఇటీవ‌లి కాలంలో అస్స‌లు క‌నిపించ‌డం లేదు వినిపించ‌డం లేదు. ఇక‌పోతే వ్య‌క్తిగ‌త జీవితంలో అత‌డు ఫేస్ చేసిన కొన్ని స‌మ‌స్య‌లే ఇలా అవ్వ‌డానికి కార‌ణం అన్న ప్ర‌చారం బ‌య‌ట ఉంది. అయితే వీట‌న్నిటికీ స‌మాధానం ఇచ్చేందుకు వేణుమాధ‌వ్ వ‌స్తాడా? లేదా? అన్న‌ది చూడాలి. ఇక‌పోతే తెలంగాణ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా జూన్ 2న ఇవ్వ‌నున్న రాష్ట్ర ప్ర‌భుత్వ అవార్డుల్లో నేరెళ్ల వేణుమాధ‌వ్ అనే మిమిక్రీ క‌ళాకారుని పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. ఈ సంద‌ర్భంగా క‌మెడియ‌న్ వేణుమాధ‌వ్‌ని ఆయ‌న అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. వేణుమాధ‌వా ఏమ‌య్యావ్‌? రా.. తిరిగి రా.. క‌ద‌లి రా… క‌దం తొక్కు!!

User Comments