సైరాలో ఫ్రీగా న‌టించిన స్టార్ ఎవ‌రు?

మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించిన `సైరా: న‌ర‌సింహారెడ్డి` టీజ‌ర్ యూట్యూబ్ లో సుమారు 2కోట్ల వ్యూస్ తో దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాని అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి కానుక‌గా ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు. అంత‌కుముందే ప్ర‌చారం ప‌రంగా స్పీడ్ పెంచిన సంగ‌తి తెలిసిందే. టీజ‌ర్ వేడుక అనంత‌రం ముంబై మీడియాతో మెగాస్టార్ చిరంజీవి స‌హా చిత్ర‌బృందం ఇంట‌రాక్ట్ అయ్యారు. త‌దుప‌రి అన్ని మెట్రో న‌గ‌రాల్లో ఈవెంట్ల‌కు రెడీ అవుతున్నారు. సాహోని మించి భారీ ఈవెంట్ ని హైద‌రాబాద్ లో నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక‌పోతే ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్, క‌న్న‌డ న‌టుడు సుదీప్, త‌మిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి, ర‌వికిష‌న్, జ‌గ‌ప‌తిబాబు, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. అయితే వీళ్ల‌లో ఒక స్టార్ మాత్రం అస్స‌లు పారిత‌షికం అన్న‌దే లేకుండా న‌టించార‌ట‌. ఆ విష‌యాన్ని నేరుగా మెగాస్టార్ చిరంజీవి రివీల్ చేశారు. బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ ని ఇలా అడ‌గ్గానే అలా ఎక్కువ ఆలోచించ‌కుండా సైరా చిత్రంలో న‌టించేందుకు అంగీక‌రించారు. అది కేవ‌లం స్నేహం కోసం వెంట‌నే అంగీక‌రించార‌ని మెగాస్టార్ తెలిపారు. అంతేకాదు.. ఈ సినిమాలో న‌టించినందుకు ఎలాంటి పారితోషికం తీసుకోలేద‌ని చిరు వెల్ల‌డించారు. క‌నీసం విమానం టిక్కెట్లు కూడా తాము ఖ‌ర్చు చేయ‌లేద‌ని చెప్ప‌డం ఆస‌క్తిక‌రం. ఈ త‌ర‌హా లో బాలీవుడ్ లో ఖాన్ లు ఒక‌రి కోసం ఒక‌రు న‌టించిన సంద‌ర్భాలు ఉన్నాయి. ఖాన్ ల సినిమాల్లోనూ అమితాబ్ పారితోషికం లేకుండా ఉచితంగా న‌టించారు. ఆ త‌ర్వాత ద‌క్షిణాదిన త‌న స్నేహితుడు చిరు కోసం మ‌రోసారి ఫ్రీగా న‌టించ‌డం చూస్తుంటే ఆయ‌న స్నేహానికి ఇచ్చే విలువ‌ను అర్థం చేసుకోవ‌చ్చు. సైరాలో న‌టించినందుకు అర‌డ‌జ‌ను పైగా టాప్ స్టార్లు భారీగా పారితోషికాలు అందుకుంటున్నారు.