రాజశేఖర్‌ కార్ ప్ర‌మాదంలో వేరొక‌రు!

Rajasekhar

హీరో రాజశేఖర్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై రాజశేఖర్‌ కారు బోల్తా పడింది. శంషాబాద్‌ దగ్గరలోని పెద్ద గోల్కండ దగ్గర అదుపు తప్పిన కారు బోల్తా పడింది. రాజశేఖర్‌ రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇంటి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. టీఎస్‌ 07 ఎఫ్‌జెడ్‌ 1234 నెంబరు కలిగిన లగ్జరీ కారు ప్రమాదంలో నుజ్జు నుజ్జ‌య్యింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెటిజ‌నుల్లో వైర‌ల్ గా మారాయి. ఇక ఈ ప్ర‌మాదంలో రాజ‌శేఖ‌ర్ కు స్వ‌ల్ప గాయాలు అవ్వ‌గా.. వేరొక‌రికి కూడా గాయాల‌య్యాయ‌ని తెలుస్తోంది.

గాయాలు కాలేదు.. నేను క్షేమం: డా.రాజశేఖర్

ఈ ప్ర‌మాదంలో త‌న‌కు ఎటువంటి గాయాలు కాలేదని రాజ‌శేఖ‌ర్ తెలిపారు. క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు. రాజశేఖర్ మాట్లాడుతూ “మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. లోపల ఉన్నది నేనే అని గుర్తు పట్టి, విన్ షీల్డ్ లోనుండి బయటకు లాగారు. అప్పుడు నేను వెంటనే వారి ఫోన్ తీసుకుని మొదట పోలీసులకు, తర్వాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడ నుండి వారి కారులో ఇంటికి బయలు దేరాను. జీవిత, మా కుటుంబ సభ్యులు ఎదురు వచ్చి, నన్ను పికప్ చేసుకున్నారు. నాకు ఎటువంటి గాయాలు కాలేదు“ అని అన్నారు.