ల‌క్ష్మీస్ ఎన్టీఆర్: రిలీజ్ ఫైట్ లో గెలుపెవ‌రిది?

ఎన్టీఆర్ బ‌యోపిక్ కు పోటీగా సంచ‌ల‌నాల రాంగోపాల్ వ‌ర్మ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` తెర‌కెక్కించిన‌ సంగ‌తి తెలిసిందే. బాల‌య్య త‌న‌కు ఛాన్స్ ఇవ్వలేద‌న్న క‌సితోనే సినిమా చేసిన‌ట్లు వ‌ర్మ బాహాటంగా చెప్పాడు. నిజం నేను చెబుతానంటూ ల‌క్ష్మీ పార్వాతిని తెర‌పైకి తీసుకొచ్చి సంచ‌ల‌న అంశాల‌తో చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ సినిమా ప్రారంభం ద‌గ్గ‌ర నుంచి వివాదాల‌తో అంట‌గాకుతోన్న సంగ‌తి తెలిసిందే. ఓ ప‌క్క కేతిరెడ్డి, మ‌రో ప‌క్క తెలుగు త‌మ్ముళ్లు వ‌ర్మ పై విరుచుకుపుడున్నారు. ఆ విమ‌ర్శ‌ల‌కు అంతే ధీటుగా వ‌ర్మ బ‌ధులిస్తున్నాడు. పోలీసులు,కేసులు,కోర్టులంటూ ఇరువురు చాలా దూరం వెళ్లారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ పోరులో గెలుపెవ‌రిది అంటే వ‌ర్మ‌దే అనాలి.

టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు చేసిన ఆరోప‌ణ‌లు, ప్ర‌శ్న‌ల‌కు అన్నింటికి వ‌ర్మ‌ తెలివైన స‌మాధానిలిచ్చి త‌న‌దే పై చేయి అని నిరూపించాడు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. అస‌లైన పోరుకు ఇప్పుడే మొద‌లైంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదా ప‌డిన సినిమాను మార్చి 22న రిలీజ్చేస్తున్నట్లు వ‌ర్మ ప్ర‌క‌టించాడు. కానీ టీడీపీ నాయ‌కులు, త‌మ్ముళ్లు ఎన్నికల పూర్త‌యిన త‌ర్వాత రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నారు. దీనికి స‌బంధించి నేరుగా కేంద్ర ఎన్న‌కల క‌మీష‌న్ కు నేరుగా ఢిల్లీ వెళ్లి మ‌రి విన‌తి ప‌త్రాలు అందించ‌డం జ‌రిగింది. ఇటు ఏపీ ఎన్నిక‌ల అధికారికి పార్టీ అధిష్టానం రిలీజ్ వాయిదా వేయాల‌ని కోరింది.

కేవ‌లం చంద్ర‌బాబు నాయుడు ప‌రువు ప్ర‌తిస్ట‌లు దిగ‌జార్చే విధంగానే సినిమా ఉంద‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారు. తాజాగా ఎన్టీఆర్ ను వెన్ను పోటు పొడిచిన వైస్రాయ్ హోట‌ల్ కు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ కూడా నిన్న‌టి రోజున‌ లీకైంది. అదిప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీంతో తెలుగు త‌మ్ముళ్ల‌లో మ‌రింత ఆందోళ మొద‌లైంది. ఎట్టిప‌రిస్థితుల్లో ఎన్నిక‌ల‌కు ముందు సినిమా రిలీజ్ కాకుండా చూడాల‌ని పార్టీ గ‌ట్టిగానే ప్రయ‌త్నాలు చేస్తోంది. రిలీజ్ పై ఇప్ప‌టికే వ‌ర్మ చిల‌వ‌లు ప‌ల‌వులుగా స్పందించినా..అస‌లైన పోరు ఇప్పుడే మొద‌లైన‌ట్లు క‌నిపిస్తోంది. రిలీజ్ కు ఇంకా వారం రోజులు స‌మ‌యమే ఉంది. మ‌రి చిత్రం పై ఎన్నిక‌ల‌ క‌మీష‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంది? అది వ‌ర్మ‌కు పేవ‌ర్ గా ఉంటుందా? టీడీపీకి అనుకూలంగా ఉంటుందా? అన్న‌ది చూడాలి.