బ‌న్నీకి రంగ‌స్థ‌లం న‌చ్చ‌లేదా..?

Last Updated on by

అదేంటి.. అలా ఎందుకు అనుకుంటున్నారు..? అయినా ఇప్పుడు ఆ అనుమానం ఎందుకు వ‌చ్చింది అనుకుంటున్నారా..? ఏమో ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఒక్క మూడు నాలుగేళ్లు వెన‌క్కి వెళ్తే త‌న‌కు త‌న సినిమాల కంటే చ‌ర‌ణ్ సినిమాలంటే ఇష్ట‌మ‌ని.. చ‌ర‌ణ్ ని నెంబ‌ర్ వ‌న్ గా చూడ‌ట‌మే త‌న‌కు ఇష్ట‌మ‌ని చెప్పాడు బ‌న్నీ. అప్ప‌ట్లో రామ్ చ‌ర‌ణ్ ఏ సినిమా చేసినా అంద‌రికంటే ముందు బ్రాండ్ అంబాసిడ‌ర్ బ‌న్నీనే. కానీ ఇప్పుడు సిచ్యువేష‌న్స్ మారిపోయాయి. లెక్క‌లు కూడా మారిపోయాయి. వేరియేష‌న్స్ వ‌చ్చేసాయి. ఇప్పుడు ఆయ‌న సినిమాల కంటే ఎవ‌రి సినిమాలు బ‌న్నీకి ఎక్కువ అనిపించ‌డం లేదు. లేక‌పోతే మ‌రేంటి.. రంగ‌స్థ‌లంపై ఇండ‌స్ట్రీ మొత్తం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తుంటే ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం అల్లు అర్జున్ ఒక్క ట్వీట్ కూడా వేయ‌లేదు. పైగా ఒక్క మాట కూడా ఎక్క‌డా మాట్లాడ‌లేదు. పైగా ఈ చిత్రానికి అత‌డి డార్లింగ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప‌ని చేసాడు. అయినా కూడా చ‌ర‌ణ్ సినిమాపై ఒక్క మాట కూడా మాట్లాడ‌టం లేదు అల్లు వార‌బ్బాయి.

ఈ మ‌ధ్య చ‌ర‌ణ్, బ‌న్నీకి పెద్ద‌గా ప‌డ‌ట్లేద‌నే ప్ర‌చారం బ‌య‌ట బాగానే జ‌రుగుతుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను త‌క్కువ చేసి మాట్లాడ‌టం.. చెప్ప‌ను బ్ర‌ద‌ర్ కామెంట్ తో పాటు వ‌ర‌స‌గా విజ‌యాలు కూడా బ‌న్నీలో కాస్త ఓవ‌ర్ హైప్ చేసుకున్నాడ‌ని అంటున్నారు. ఇదే ఇప్పుడు ఆయ‌న్ని మెగా ఫ్యామిలీకి కూడా దూరం చేస్తుంద‌ని.. అందుకే అల్లు అర‌వింద్ మ‌రోసారి చిరంజీవిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడ‌ని చెబుతున్నారు. రంగ‌స్థ‌లం ఈవెంట్ లో చిరంజీవి లేక‌పోతే ఎవ‌రూ లేరంటూ మ‌రోసారి మాట్లాడాడు అల్లుఅరవింద్. ఇప్ప‌టికే ప‌వ‌న్ ఫ్యాన్స్ బ‌న్నీని పూర్తిగా దూరం పెట్టారు. ఇప్పుడు అర‌వింద్ ఐస్ చేసే ప‌నిలో ఉన్నాడు. అల్లుఅర్జున్ ఇప్పుడు షూటింగ్ తో బిజీగా ఉన్నాడ‌ని తెలుసు.. కానీ మ‌రీ ఒక్క ట్వీట్ కూడా వేయ‌లేనంత బిజీనా..! ఇదే ఇప్పుడు అభిమానుల్లో ఉన్న అనుమానం.

User Comments