భారతీయుడు 2 ఎందుకీ ఆల‌స్యం?

Last Updated on by

ఉల‌గ‌నాయ‌గ‌న్ క‌మ‌ల్ హాస‌న్ – శంక‌ర్ కాంబినేష‌న్ మూవీ భార‌తీయుడు సంచ‌ల‌నాల గురించి తెలిసిందే. ఆ సినిమాకి దాదాపు 20 ఏళ్ల త‌ర్వాత సీక్వెల్ తెర‌కెక్కిస్తున్నారు. అయితే ఈ సీక్వెల్ స‌జావుగా చిత్రీక‌ర‌ణ పూర్తి కాక‌పోవ‌డంపై అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొంది. ఆరంభం ఆర్థిక‌ప‌ర‌మైన కార‌ణాల‌తో నిర్మాణ సంస్థ వెన‌క‌డుగు వేసింద‌న్న ప్ర‌చారం సాగింది. అటుపై క‌మ‌ల్ హాస‌న్ కి మేక‌ప్ ప‌ర‌మైన స‌మ‌స్య‌లు త‌లెత్తాయ‌ని.. ఎల‌ర్జీ వ‌ల్ల వాయిదా వేస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. అదే స‌మ‌స్య హీరోయిన్ కి కూడా త‌లెత్తింద‌న్నారు.
ఇటీవ‌ల క‌మ‌ల్ హాస‌న్ ఎన్నిక‌ల హ‌డావుడిలో బిజీగా ఉండ‌డంతో మ‌రోసారి వాయిదా ప‌డింది. ఓవ‌రాల్ గా ఈ వాయిదాల ఫ‌ర్వం అలా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఇలా జ‌ర‌గ‌డానికి కార‌ణ‌మేంటి? అంటే చిత్ర క‌థానాయిక కాజ‌ల్ కూడా ఇంచుమించు అదే స‌మాధాన‌మిచ్చింది. క‌మ‌ల్ స‌ర్ బిజీగా ఉన్నారు. అందుకే వాయిదా ప‌డింద‌ని కాజ‌ల్ తెలిపారు. భార‌తీయుడు 2 సెట్స్ పైకి వెళుతుంద‌ని కాజ‌ల్ అన్నారు. శ‌ర్వానంద్ .. జ‌యం ర‌విల‌తోనూ త‌దుప‌రి న‌టిస్తున్నాన‌ని అవి రెండూ రిలీజ్ ల‌కు రెడీ అవుతున్నాయ‌ని చంద‌మామ వెల్ల‌డించారు. మ‌రో రెండ్రోజుల్లో ఓ కొత్త సినిమాని ప్ర‌క‌టిస్తున్నానని తెలిపింది. ఈ చిత్రాన్ని ప‌లు భాష‌ల్లో తెర‌కెక్కించ‌నున్నార‌ని రివీల్ చేసింది. ఇక కాజ‌ల్ న‌టించిన ప్యారిస్ ప్యారిస్ రిలీజ్ కి రానుంది.