మ‌హేష్‌కి రాజ‌కీయాలు అంటే భ‌య‌మా?

Last Updated on by

సూప‌ర్ స్టార్ మ‌హేష్ రాజకీయారంగేట్రం చేస్తున్నారు అంటూ ఒక‌టే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఓవైపు ఘ‌ట్ట‌మ‌నేని అభిమానుల్లో, మ‌రోవైపు కామ‌న్ జ‌నాల్లో దీనిపై ఆస‌క్తిక‌రంగా చ‌ర్చ సాగుతోంది. మ‌హేష్ బాబాయ్ ఘ‌ట్ట‌మ‌నేని ఆది శేష‌గిరిరావు తేదేపాలో చేరిన నేప‌థ్యంలో మ‌హేష్ ఆ పార్టీకి ప్ర‌చారం చేస్తార‌ని, 2019 ఎన్నిక‌ల్లో మ‌హేష్ పాత్ర కీల‌కం కానుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. అయితే ఇందులో నిజం ఎంత‌? నిజంగానే మ‌హేష్ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా? అని అభిమానులు నేరుగా న‌మ్ర‌త‌ను ప్ర‌శ్నించారు. ఆ ప్ర‌శ్న‌కు షాక్ తిన్న న‌మ్ర‌త కాస్తంత త‌త్త‌ర‌ప‌డిన‌ట్టే క‌నిపిస్తోంది.

ఆ ప్ర‌శ్న అడిగిన వారిని ఉద్ధేశించి.. న‌మ్ర‌త చేతులు జోడించి దండం పెట్టే ఈమోజీని పోస్ట్ చేయ‌డం పెద్ద షాకిచ్చింది. మ‌హేష్ ని తెర‌పై సీఎంగా చూసుకుంటే చాలు. నిజ‌జీవితంలో అస్స‌లు వ‌ద్దు. త‌న‌కు రాజ‌కీయాలు గిట్ట‌వు. అస‌లు స‌రిప‌డ‌నే ప‌డ‌వు. ఆయ‌న‌కు రాజకీయాలు అస్స‌లు అర్థం కానే కావు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చే ప్ర‌స‌క్తే లేదు“ అని అన్నారు.
దీంతో మ‌హేష్ పై వ‌స్తున్న‌వ‌న్నీ పుకార్లు మాత్ర‌మేన‌ని అభిమానుల‌కు క్లారిటీ వ‌చ్చేసింది. మ‌హేష్ రాజ‌కీయాల్లోకి రావ‌డం అటుంచితే, అస‌లు క్యాంపెయినింగ్ కి అయినా వ‌స్తాడా.. లేదా? అన్న‌ది సందేహ‌మే. ఇదివ‌ర‌కూ ప‌లుమార్లు ఎన్నిక‌ల్లో ప్ర‌చారం కోసం పిలిస్తేనే మ‌హేష్ వెళ్ల‌లేదు. అప్ప‌ట్లో బావ గ‌ల్లా జ‌య‌దేవ్ త‌ర‌పున ప్ర‌చారానికి నామ‌మాత్రంగా మాత్ర‌మే ఎటెండ్ అయ్యాడు కానీ, మ‌న‌స్ఫూర్తిగా వెళ్ల‌లేదు. సూప‌ర్ స్టార్ కృష్ణ బాట‌లోనే రాజ‌కీయాలు అంటూ లేనిపోని క‌ష్టాలు తెచ్చుకోవ‌డం త‌న‌కు ఇష్టం ఉండ‌ద‌ని అర్థం చేసుకోవచ్చు. మ‌హేష్‌- న‌మ్ర‌త జంట వైవాహిక జీవితం 14 వ వ‌సంతంలోకి అడుగుపెట్టింది. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్ లో ఓ ఫోటోని అభిమానుల‌కు షేర్ చేశారు. ఈ ఫోటో అంత‌ర్జాలంలో జోరుగా వైర‌ల్ అవుతోంది.

User Comments