జ‌గ‌న్‌ని మంచు హీరో ఎందుకు క‌లిశారు?

Last Updated on by

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నా కొద్దీ ఏపీలో రాజ‌కీయం వేడెక్కుతోంది. దీనికితోడు అధికార టీడీపీ నుంచి ప్ర‌తిప‌క్ష వైసీపీలోకి చేరిక‌లు జోరందుకోవ‌డం మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. దీనికి సినీ తార‌ల గ్లామ‌ర్ తోడ‌వ్వ‌డంతో అధికార పార్టీ టీడీపీకి ఊపిరాడ‌ని ప‌రిస్థితి. ఆ మ‌ధ్య హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్‌లో వైఎస్ జ‌గ‌న్‌ని హీరో నాగార్జున ప్ర‌త్యేకంగా వెళ్లి క‌ల‌వ‌డం, ఈ భేటీకి సంబంధించిన వివ‌రాల్ని మీడియాతో చెప్ప‌డానికి నిరాక‌రించ‌డం వ‌టి కార‌ణాల‌తో పెద్ద చ‌ర్చేజ‌రిగింది. నాగార్జున గుంటూరు పార్ల‌మెంట్ స్థానం నుంచి పోటీకి దిగుతున్నార‌ని, అందుకే ర‌హ‌స్యంగా జ‌గ‌న్‌ను క‌లిశార‌ని ప్ర‌చారం జ‌రిగింది.

టాపిక్ ఎటో వెళుతోంద‌ని గ్ర‌హించిన నాగార్జున అలాంటిది ఏమీ లేద‌ని, జ‌గ‌న్ కుటుంబంతో నాకు ప్ర‌త్యేక అనుబంధం వుంద‌ని స్వ‌యంగా ప్ర‌క‌టించ‌డంతో పుకార్లు స‌ద్దుమ‌నిగాయి. తాజాగా మ‌రో హీరో జ‌గ‌న్‌ని క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. మంచు విష్ణు స‌తీస‌మేతంగా వైఎస్ జ‌గ‌న్‌ని ప్ర‌త్యేకంగా క‌లిశారు. అయితే ఇది రాజ‌కీయ భేటీ కాద‌ని, నూత‌న గృహ ప్ర‌వేశానికి సంబంధించి శుభాకాంక్షలు తెలియ‌జేయ‌డానికి క‌లిశాన‌ని, ఆయ‌న‌కు దేవుడు మ‌రింత బ‌లాన్నిచ్చి ఆయ‌ర కోరిక‌ను నెర‌వేర్చాల‌ని కోరుకుంటున్నాన‌ని మంచి విష్ణు ట్విట్ట‌ర్ వేదిక‌గా క్లారిటీ ఇచ్చారు. అయితే మోహ‌న్‌బాబు రాజ‌కీయ ఎంట్రీకి సంబంధించిన చ‌ర్చ జ‌రిగి వుంటుంద‌ని, ఆయ‌న‌కు ఏ స్థానాన్ని కేటాయించ‌బోతున్నార‌న్న దానిపైనే చ‌ర్చించి వుంటార‌ని మ‌రో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందులో నిజ‌మెంత అనేది మంచు విష్ణు చెప్పాల్సిందే.

User Comments