ఆఫీస‌ర్‌`ని ప‌ట్టించుకోరేం?

Last Updated on by

కింగ్ నాగార్జున క్రేజు త‌గ్గిందా?  నాగ్‌లో మ్యాట‌ర్‌ త‌గ్గిందా?  లేదూ వ‌ర్మ ప్ర‌భావం కింగ్‌పై ప‌డిందా? అంటే .. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌డం అంత తేలికేం కాదు. `శివ‌` బ్యాచ్ ఆప‌రేష‌న్ తిరిగి ప్రారంభ‌మైంది అన్న‌ప్పుడు ఉన్నంత ఉద్వేగం ఇప్పుడు ఎందుక‌నో క‌నిపించ‌డం లేదు. ఒక‌ప్పుడు నాగార్జున‌కు ఉన్న క్రేజు ఇప్పుడు అలానే ఉందా? అంటే సందేహాలొస్తున్నాయి. ఆఫీస‌ర్ ట్రైల‌ర్ రిలీజైనా.. దాని గురించి ఎవ‌రూ పెద్దంత‌గా ప‌ట్టించుకోలేదంటే కార‌ణం ఏమై ఉంటుందో… ఆలోచించాల్సి వ‌స్తోంది. ప‌వ‌న్‌తో ఆర్జీవీ వివాదం నేప‌థ్యంలోనే ఈ స‌న్నివేశం త‌లెత్తిందా?  లేక నిజంగానే ఆఫీస‌ర్‌లో అస‌లు విష‌యం క‌నిపించ‌లేద‌ని భావించాలా?  ప‌దే ప‌దే త‌ర‌చి చూడాల్సిన ప‌రిస్థితి ఉందిప్పుడు.
శ‌నివారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఆఫీస‌ర్ కొత్త ట్రైల‌ర్ రిలీజైంది. కానీ ఈ ట్రైల‌ర్‌ని ఎవ‌రూ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. యూట్యూబ్‌లో అంతంత‌మాత్ర‌మే వ్యూస్ ద‌క్క‌డం కాస్త క‌ల‌వ‌ర‌పెట్టేదే. అస‌లు ఈ ట్రైల‌ర్‌లో ఏం ఉంది? అంత ప‌స లేదా అంటే ట్రైల‌ర్ ఫాల్ట్ మాత్రం క‌నిపించ‌లేదు. క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో ముంబై మ‌హాన‌గ‌రం ఒణికిపోతున్న స‌మ‌యంలో అస‌లు సిస‌లు మొన‌గాడైన పోలీసాఫీస‌ర్ ఆ న‌గ‌రంలో అడుగుపెట్టి ఏం చేశాడు? అన్న‌ది ట్రైల‌ర్‌ ఆవిష్క‌రించాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఇదివ‌ర‌కూ రిలీజ్ చేసిన ట్రైల‌ర్‌కి కొన్ని నెగెటివ్ రివ్యూలు వ‌చ్చినా.. ఈసారి మాత్రం `ఆఫీస‌ర్‌` ట్రైల‌ర్ ఫ‌ర్వాలేద‌నిపించింది.
ఈ ట్రైల‌ర్‌లో ఆఫీస‌ర్ త‌డాఖా ఏంటో చూపించే ప్ర‌య‌త్నం చేశాడు. ప్ర‌తి మ‌నిషిలో దేవుడు, రాక్ష‌సుడు ఉంటాడు.. అంటూ ఆఫీస‌ర్ చెబుతున్న డైలాగ్‌లు ఆక‌ట్టుకున్నాయి. ఆర్జీవీ త‌న‌దైన శైలిలో మరో మాఫియా క‌థ‌ను పోలీసాఫీస‌ర్ కోణంలో ఆవిష్క‌రించార‌ని ఈ ట్రైల‌ర్ చెబుతోంది.  అయితే సినిమాలో కూడా ఈ ట్రైల‌ర్‌లో ఉన్నంత మ్యాట‌ర్ ఉందా? అంత గొప్ప క‌థ‌ని ఆర్జీవీ ఎంచుకున్నాడా?  మాఫియా క‌థ‌ల్లో పాత వాస‌న చూపించ‌కుండా కొత్త‌గా అత‌డు ఏం చేశాడు? అన్న‌ది ఈ సినిమా ఫ‌లితాన్ని నిర్ణ‌యిస్తుంది. ఆఫీస‌ర్ రిలీజ్ తేదీ ఎప్పుడు అన్న‌ది పూర్తిగా క‌న్ఫామ్ చేయాల్సి ఉందింకా. ఇక వేరొక కోణంలో చూస్తే, కింగ్‌లో ప‌స అయిపోలేదు. అయితే ఆర్జీవీ వివాదాలు అత‌డి కొంప ముంచుతున్నాయని తాజా స‌న్నివేశం చెబుతోంది.

User Comments