అక్కినేని ఫ్యామిలీ అవార్డ్స్ ఫంక్షన్ కి ఇంటి కోడలు సమంత డుమ్మా కొట్టడం సర్వత్రా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. అసలు కుదరక రాలేదా.. లేక కావాలనే ఫంక్షన్‌కు దూరంగా వుందా? అన్నది ఫిలిం ఇండస్ట్రీ వర్గాలని తొలుస్తున్న ప్రశ్న.
2018కి గానూ శ్రీదేవికి, 2019 సంవత్సరానికి గానూ బాలీవుడ్ సీనియర్ నటి రేఖకు ఈ నెల 17న అక్కినేని జాతీయ అవార్డును ప్రదానం చేశారు. హైదరాబాద్ అన్నపూర్ణలో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నాగార్జున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీదేవి తరుపున బోనీకపూర్‌కు, రేఖకు అవార్డుల్ని అందజేశారు. ఈ ఫంక్షన్లో అక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ అంతా పాల్గొన్నారు. సుప్రియ దగ్గరి నుంచి అక్కినేని వెంకట్ కుమార్తెలు మనవళ్లు ఇతర ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్నారు. కానీ అక్కినేని వారి ఇంటి కోడలు సమంత మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఏఎన్నార్ అవార్డుల వేడుక అంటే అక్కినేని వారి ఫ్యామిలీ ఫంక్షన్. అలాంటి ఫంక్షన్‌కు సాక్ష్యాత్తు అక్కినేని వారింటి కోడలు హాజరు కాకపోవడం పలువురిని ఆలోచింపజేస్తోంది. కారణం ఏదైనా సమంత ఈ ఫంక్షన్లో వుంటే నిండుగా వుండేదని, ఆ లోటు కనిపించిందని అంతా చెవులు కొరుక్కున్నారు. అయితే సమంత రాకపోవడానికి కారణమేమిటి అంటే తనకు ఆరోగ్యం బాలేని కారణంగా రాలేదని తెలిసింది. ఒంట్లో నలతగా ఉంది. పైగా బయటికి రాలేనంత ఇబ్బందికరమైన పరిస్థితిలోనే హాజరు కాలేదని చెబుతున్నారు.