Last Updated on by
తారక్ ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారా? అంటే అవుననే తెలుస్తోంది. గత కొంతకాలంగా తారక్ మారిన రూపం ఇదీ! అంటూ కొన్ని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తాయి. జక్కన్న ఆర్.ఆర్.ఆర్ కోసం ఇలా మారిపోయాడంటూ బొద్దుగా ఉన్న ఆంధ్రావాలా ఫోటోల్ని సర్క్యులేట్ చేయడంతో ఒకటే గందరగోళం నెలకొంది. ఈ మార్పు నిజమేనా? అని పరిశీలిస్తే అదంతా తప్పుడు ప్రచారం అని తేలింది. తాజాగా తన ఫిట్ నెస్ ట్రైనర్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ జక్కన మల్టీస్టారర్ చిత్రంలోని ఎన్టీఆర్ లుక్‌పై క్లారిటీ ఇచ్చేశాడు. వివరాల్లోకి వెళితే..
గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ లుక్ ఇలా వుంటుంది. అలా వుంటుందటూ, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఏకంగా వంద కిలోలు బరువు పెరిగాడంటూ వస్తున్న వార్తలపై ఫిజికల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. స్టీవెన్స్ ట్వట్టర్ ద్వారా క్లారిటీ ఇస్తూ… అది ఏడాది క్రితం ఫోటో అని, `ఆర్ ఆర్ ఆర్`లో ఎన్టీఆర్ లుక్ ఇది కాదని స్పష్టం చేశాడు.
లాయిడ్ స్టీవెన్స్ గతంలో రణ్వీర్ సింగ్ వంటి బాలీవుడ్ పాపులర్ హీరోలకు ఫిట్ నెస్ ట్రైనర్‌గా పనిచేశాడు. భారీ మొత్తంలో ఫీజు వసూలు చేసే లాయిడ్ స్టీవెన్స్ పక్కాగా స్టార్ హీరోలకు శిక్షణ ఇస్తాడనే పేరుంది. అందుకే ఆయనకు భారీ మొత్తాల్లో చెల్లించడానికి హీరోలు వెనుకాడటం లేదట. `బాహుబలి` వంటి భారీ చిత్రం తరువాత దర్శకధీరుడు రాజమౌళి క్రేజీ హీరోలైన ఎన్టీఆర్, రామ్‌చరణ్ ల కలయికలో ఓ భారీ మల్టీస్టారర్‌కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. `ధూమ్` సిరీస్ చిత్రాలకు ధీటుగా అదే పంథాలో అత్యున్నతమైన సాంకేతికతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ శక్తివంతమైన ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నారు. ఇందు కోసం అతని లుక్ పరంగా కొత్తగా వుండాలని రాజమౌళి అతని కోసం ఓ ఫిజికల్ ట్రైనర్‌ను అరెంజ్ చేసిన విషయం తెలిసిందే.
User Comments