పెళ్లామ్‌ బ్లాక్‌మెయిల్?

Last Updated on by

భ‌ర్త‌ను మోసం చేస్తూ వేరొక‌నితో అక్ర‌మ‌సంబంధం పెట్టుకునే భార్య‌కు ఆ భ‌ర్త ఎలా బుద్ధి చెప్పాడు? అన్న కాన్సెప్టుతో తెర‌కెక్కిన `బ్లాక్‌మెయిల్‌` సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో ఈ త‌ర‌హా క‌థాంశాలు కొత్తేమీ కాదు కానీ, ఇర్ఫాన్ అద్భుత న‌ట‌న‌తో ఈ చిత్రం బంప‌ర్ హిట్ కొట్టింది. ఇప్పుడు అదే తీరుగా `వీరే ది వెడ్డింగ్‌`లోనూ సేమ్ పాయింట్‌ని చూపించి మ‌హిళా ద‌ర్శ‌కురాలు ఆక‌ట్టుకోవ‌డంపై వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. ఈ చిత్రంలో స్వ‌రాభాస్క‌ర్ పాత్ర పూర్తిగా న్యూడిటీకి సంబంధించిన‌ది.

మ‌గ‌నితో ప‌డ‌క‌ సుఖం లేక‌పోవ‌డంతో వేరొక యువ‌కుడితో స్వ‌రా అక్ర‌మ‌సంబంధం పెట్టుకుంటుంది. ఆ క్ర‌మంలోనే త‌న త‌ల్లిదండ్రులు త‌న స‌న్నివేశం చూసి స‌పోర్ట్ చేస్తారు. అయితే స్వ‌రా భ‌ర్త త‌న‌ని బ్లాక్‌మెయిల్ చేస్తూ వేదిస్తాడు. అటుపై క‌థేంటి అన్న‌ది ఆస‌క్తిక‌రం. పెళ్ల‌యిన మ‌గువ‌ల క‌ష్టాల‌పై తీసిన `వీరే ది వెడ్డింగ్` చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంటోంది. పోస్ట్ మ్యారేజ్ గాళ్స్ నేప‌థ్యంలో సెక్సువ‌ల్ కంటెంట్‌ని హైలైట్ చేస్తూ.. ఈ స్థాయిలో ఎలివేట్ చేసిన సినిమా వేరొక‌టి లేదంటూ ఒక‌టే వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. ముఖ్యంగా స్వ‌రాభాస్క‌ర్ పాత్ర హైలైట్‌గా ఉంద‌ని చెబుతున్నారు. క‌రీనా, సోన‌మ్ ఈ చిత్రంలో ఇత‌ర పాత్ర‌ల్లో నటించిన సంగ‌తి తెలిసిందే.

User Comments