రంభ.. క‌మెడియ‌న్ తో రొమాన్సా..?

రంభ‌.. ఈ పేరుకు ఒక‌ప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల్లో చెర‌గ‌ని ముద్ర ఉండేది. ఇప్ప‌టికీ ఉంది కూడా. 20 ఏళ్ల కింద త‌న అందంతో తెలుగు ఇండ‌స్ట్రీని షేక్ చేసింది ఈ ముద్దుగుమ్మ‌. చిరంజీవి నుంచి బ‌న్నీ వ‌ర‌కు అంద‌రితోనూ రొమాన్స్ చేసింది ఈ భామ‌. గ్లామ‌ర్ షోతో పాటు న‌టిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న రంభ‌.. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది. కొన్ని సినిమాల్లో న‌టించినా కూడా కోరుకున్న గుర్తింపు అయితే రాలేదు. కొన్నాళ్లుగా పూర్తిగా సినిమాల‌కు దూర‌మై.. ఇంటికే ప‌రిమితం అయింది ఈ ముద్దుగుమ్మ‌.Will Actress Ramba To Make a Comeback With Comedy Hero?రంభ‌ ఫిజిక్ విష‌యంలో మాత్రం ఇప్ప‌టికీ త‌న అభిమానుల‌ను దృష్టిలో పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ‌. వ‌య‌సు 40 దాటినా ఇప్ప‌టికీ హాట్ హాట్ పోజుల‌కు రెచ్చ‌గొడుతుంది రంభ ఆంటీ. ఇన్నాళ్ళ త‌ర్వాత మ‌ళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ కోసం సిద్ధ‌మ‌వుతుంది రంభ‌. అది కూడా క‌మెడియ‌న్ స‌ప్త‌గిరితో. సెల్ఫీరాజా, సిద్ధు ఫ్ర‌మ్ సికాకుళం లాంటి సినిమాలు చేసిన ఈశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రంభ సినిమా చేయ‌బోతుంది. స‌ప్త‌గిరికి జోడీగా న‌టిస్తుందా.. లేదంటే ఈ చిత్రంలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుందా అనేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్. ఏదేమైనా చాలా ఏళ్ళ త‌ర్వాత తెలుగు ఇండ‌స్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. మ‌రి రంభ‌ను అప్ప‌టి మాదిరే ఇప్పుడు కూడా రిసీవ్ చేసుకుంటారో చూడాలి..!Will Actress Ramba To Make a Comeback With Comedy Hero?