మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తర్వాత ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం చూస్తే బన్నీకి ఎక్కువ మార్కెట్ ఉంది. రంగస్థలంతో బన్నీని కాస్త వెనక్కి నెట్టేసాడు రామ్ చరణ్. అయితే ఈ కుటుంబానికి ఫాలోయింగ్ విషయంలో మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పుడు రాజకీయాల పరంగానూ మెగా ఫ్యామిలీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇప్పటికే చిరంజీవి ప్రజారాజ్యంతో ప్రజల్లోకి వచ్చాడు. కానీ చిరు ఆశలు నిలబడలేదు. ప్రజారాజ్యం దారుణంగా విఫలమైంది. కానీ అప్పుడు అన్నయ్యకు సపోర్ట్ గా పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్.. అల్లుఅర్జున్ కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన అంటున్నాడు.
గత ఎన్నికల్లో టీడిపికి సపోర్ట్ చేసి అండగా నిలిచాడు. కానీ ఇప్పటి వరకు మెగా కుటుంబంలో అఫీషియల్ గా ఏ ఒక్క హీరో కూడా పవన్ కు సపోర్ట్ చేస్తామంటూ బయటికి రాలేదు. చివరికి చిరంజీవితో సహా. కానీ ఇప్పుడు ఏమవుతుందో తెలియదు కానీ అన్నయ్యతో చాలా దగ్గరవుతున్నాడు పవన్. ఈ సందర్భంలో బన్నీ కూడా జనసేనపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు. ఈ మధ్య కాలంలో బన్నీ, పవన్ మధ్య అభిప్రాయ భేధాలు వచ్చాయని తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ కాకుండా సొంత కుంపటి కోసం బన్నీ ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పవన్ పై ఆయన చేసిన బ్రదర్ కామెంట్స్ ఆయన ఇమేజ్ ను కూడా దెబ్బతీసాయి.
చిరు కూడా అల్లుఅర్జున్ కి ఈ విషయంలో క్లాస్ పీకాడని తెలుస్తుంది. ఇవన్నీ ఇలా ఉంటే ఇప్పుడు బర్త్ డే ఇంటర్వ్యూలో జనసేనపై ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు బన్నీ. తాను జనసేనకు సపోర్ట్ చేయాలనుకోవడం అనేది తన సొంత నిర్ణయం కాదని.. చిరంజీవి గారు సపోర్ట్ చేస్తే తాను కూడా చేస్తానని.. లేదంటే లేదు అని తేల్చేసాడు. అంటే మెగాస్టార్ అడుగు జాడల్లోనే తానిప్పటికీ ఉన్నానని అభిమానులకు హింటిచ్చాడు అల్లుఅర్జున్. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం కాస్త అసంతృప్తితో ఉన్నాడు బన్నీ. మావయ్య పార్టీనే కదా.. చేస్తానంటూ ముందుకు రాకుండా చిరంజీవి చెప్తే చేస్తా లేదంటే లేదు అనడం కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చడం లేదు. మొత్తానికి.. ఈ మెగా రాజకీయాలు ఎటువైపు వెళ్లనున్నాయో..?