మ‌హాన‌టి.. బాలీవుడ్ పిలుస్తుంద‌మ్మా..!

Last Updated on by

అమ్మ ఎవ‌రికైనా అమ్మే క‌దా..! ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. సావిత్ర‌మ్మ జీవితం తెలుగులో వ‌చ్చింది.. త‌మిళ్ లోకి వెళ్లింది.. మ‌ళ‌యాలంలోకి కూడా విడుద‌ల చేస్తున్నారు. అలాంట‌ప్పుడు మేమేం పాపం చేసాం అంటున్నారు ఉత్తరాది ప్రేక్ష‌కులు. మ‌హాన‌టి జీవితం మేం కూడా చూస్తాం అంటున్నారు వాళ్లు. ఇప్పుడు మ‌హాన‌టి రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ నిర్మాత‌లు పోటీ ప‌డుతున్నారు. అందులో ముఖ్యంగా ఆదిత్యాచోప్రా అయితే అశ్వినీద‌త్ తో బేర‌సారాలు కూడా మాట్లాడేసి.. రేట్ కూడా ఫిక్స్ చేసాడ‌ని తెలుస్తుంది.

మ‌హాన‌టి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాల‌ని భావిస్తున్నాడు నిర్మాత‌ ఆదిత్యాచోప్రా. అయితే ఇక్క‌డ అంద‌రికీ ఒక‌టే స‌మ‌స్య‌.. బాలీవుడ్ లో సావిత్రి అంత అద్భుతంగా న‌టించే న‌టి ఎవ‌రు..? ఒక‌వేళ కీర్తిని అడిగితే ఆమె మ‌ళ్లీ న‌టించే సాహ‌సం అయితే చేయ‌దు. అయితే సావిత్రికి హిందీలో కూడా గుర్తింపు ఉంది. అప్ప‌ట్లో ఆమె అక్క‌డ కూడా సినిమాలు చేసింది.. ఉత్త‌రాదిన కూడా ఈమెకు అభిమానులు ఉన్నారు. దాంతో ఇప్పుడు మ‌హాన‌టి అక్క‌డ కూడా తీస్తే బాగుంటుంద‌ని అనుకుంటున్నాడు ఆదిత్యా చోప్రా.

User Comments