బాహుబ‌లి 2 తొలి 2000 కోట్ల సినిమా..!

Last Updated on by

బాహుబ‌లి 2 ఇండియాలోనే కాదు.. చాలా దేశాల్లో త‌న జెండా పాతేసింది. ఇప్పుడు చైనాలో కూడా మ‌న సినిమా ర‌చ్చ న‌డుస్తుంది. అక్క‌డ తొలి భాగం డిజాస్ట‌ర్ అయినా రెండో భాగానికి మాత్రం బాగానే క‌నెక్ట్ అవుతున్నారు చైనీయులు. అక్క‌డ రెండు రోజుల్లో బాహుబ‌లి 2 35 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది. తొలిరోజు 2.83 మిలియ‌న్ వ‌సూలు చేసి.. దంగ‌ల్ రికార్డుల‌ను సైతం తుడిచేసిన బాహుబ‌లి 2 రెండో రోజు కూడా అదే దూకుడు ప్ర‌ద‌ర్శించింది. 2.98 మిలియ‌న్ తో స‌త్తా చూపించింది. మూడో రోజు ఆదివారం కావ‌డంతో క‌నీసం 4 మిలియ‌న్ వ‌స్తుంద‌ని ఊహిస్తున్నారు ట్రేడ్ వ‌ర్గాలు. బాహుబ‌లి 2 దూకుడు చూస్తుంటే చైనాలో ఈజీగా 200 కోట్లు వ‌సూలు చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ఇదే జ‌రిగితే ఇండియాలో తొలి 2000 కోట్ల సినిమాగా బాహుబ‌లి 2 చ‌రిత్ర సృష్టించ‌డం ఖాయం. మరి.. బాహుబ‌లి 2 జాత‌కం ఎలా ఉండ‌బోతుందో..? ఈ దూకుడు ఇంకా ఎన్ని రోజులు కొన‌సాగ‌నుందో..?

User Comments