Last Updated on by
అదేంటి.. ఇప్పటికీ కుర్రాళ్లకు పోటీగా డాన్సులు చేస్తాడు.. ఫైట్లు చేస్తాడు.. అన్నింటికీ మించి మొన్నే సంక్రాంతికి జై సింహాతో హిట్ కూడా కొట్టాడు.. అప్పుడే రేస్ లో వెనకబడటం ఏంటి అనుకుంటున్నారా..? అయితే ఈ రేస్ ఆయన కెరీర్ కు సంబంధించింది కాదు. ఆయన కెరీర్ స్పీడ్ టెస్ట్ ను లెక్కేసేది. అర్థం కాలేదు కదా..! కొన్నేళ్లుగా బాలయ్య అందరికంటే జోరు మీదున్నాడు. 100 సినిమాలు పూర్తైన తర్వాత కూడా రెస్ట్ తీసుకోలేదు ఈ హీరో. గౌతమీపుత్ర శాతకర్ణి వచ్చిన కొన్ని నెలలకే పైసావసూల్ అంటూ వచ్చాడు. అది వచ్చిన నాలుగు నెలలకే జై సింహాతో వచ్చాడు. అయితే జై సింహా వచ్చిన తర్వాత మాత్రం ఈయన సైలెంట్ అయిపోయాడు.
ఇన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఆర్నెళ్ళకు పైగా గ్యాప్ తీసుకున్నాడు బాలకృష్ణ. తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ కోసం గ్యాప్ తీసుకున్నా.. ఇప్పుడు తేజ తప్పుకోవడంతో ఆ బయోపిక్కే సందిగ్ధంలో పడింది. దాంతో నెక్ట్స్ ఏంటో తెలియకుండా ఉన్నాడు బాలయ్య. జూన్ నుంచి వినాయక్ సినిమా ఉంటుందని సి కళ్యాణ్ చెప్పినా కూడా బాలయ్య మాత్రం చెప్పలేదింకా. దాంతో బాలయ్య రేస్ లో ప్రస్తుతానికి వెనకే ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు చిరు సైరాతో.. నాగార్జున ఆఫీసర్, నాని సినిమాలతో.. వెంకటేష్ ఎఫ్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. సీనియర్లలో ఒక్క బాలయ్య మాత్రమే ఖాళీగా ఉన్నాడు. మరి ఈ గ్యాప్ ను ఎప్పుడు కవర్ చేస్తాడో బాలయ్య..!
User Comments