చిరు పై క‌న్నేసిన నాని

Last Updated on by

అవును.. ఈ మాట చెప్పింది కూడా ఎవ‌రో కాదు నానినే. అ.. సినిమా విడుద‌ల సంద‌ర్భంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చిరు స్థానంలోకి వెళ్లాల‌ని ఉంద‌ని చెప్పాడు నాని. అయితే ప్లేస్ అంటే నెంబ‌ర్ వ‌న్ కావాల‌ని కాదు.. అప్ప‌ట్లో ఆయ‌న న‌టించిన సినిమాల్లో చంట‌బ్బాయి స్థానంలోకి వెళ్లాల‌ని ఉంద‌ని మ‌న‌సులో మాట చెప్పాడు న్యాచుర‌ల్ స్టార్. చిరంజీవి సినిమాల్లో రీమేక్ చేయాల్సి వ‌స్తే.. ఏది చేస్తార‌ని అడిగిన ప్ర‌శ్న‌కు మరో ఆలోచ‌న లేకుండా చంట‌బ్బాయి అని చెప్పాడు నాని. చంట‌బ్బాయి చిరంజీవి కెరీర్ లో ఓ మైలురాయి. పాండ్ జేమ్స్ పాండ్.. వెల్ క‌మ్ మిస్ జ్వాలా అంటూ చిరంజీవి చెప్పిన డైలాగులు అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం. మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవి.. జంధ్యాల‌తో క‌లిసి చేసిన కామెడీ చంట‌బ్బాయి. అద్భుత‌మైన కామెడీకి తోడు క‌న్నులు త‌డిపే ఎమోష‌న్ కూడా ఈ క‌థ‌లో ఉంటుంది.

చంట‌బ్బాయి సినిమాను రీమేక్ చేయాల‌ని ఇప్ప‌టికే చాలా మంది హీరోలు అనుకున్నారు. కానీ చిరంజీవి రేంజ్ లో కామెడీ చేసే స్థాయి ఇప్ప‌టి హీరోల్లో ఎవ‌రికీ లేదు. అంత నాచుర‌ల్ కామెడీ ఒక్క మెగాస్టార్ కే సాధ్యం. ఇన్నాళ్ల‌కు చంటబ్బాయి రీమేక్ పై ఓ హీరో మ‌న‌సు ప‌డ్డాడు. అత‌డే నాని. న్యాచుర‌ల్ స్టార్ గా ఇండ‌స్ట్రీలో స్టార్ ఇమేజ్ అందుకున్నాడు నాని. పైగా కామెడీ టైమింగ్ లోనూ దున్నేస్తున్నాడు ఈ హీరో. ఈయ‌న చంట‌బ్బాయి రీమేక్ పై ఆస‌క్తి చూపిస్తున్నాడు. ఆ మ‌ధ్య ఈ విష‌యాన్ని నేరుగా చిరంజీవితోనే చెప్పాడు నాని. అంతేకాదు.. తాను చంట‌బ్బాయి చేస్తే అందులో గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇవ్వాల‌ని మెగాస్టార్ నే కోరాడు నాని. స్క్రిప్ట్ సిద్ధం చేయించండి.. ఖచ్చితంగా చేస్తానంటూ చిరు అప్ప‌ట్లో మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోలో అభిమానుల సాక్షిగా స‌మాధాన‌మిచ్చాడు. ఈ జోరు చూస్తుంటే నాని చంట‌బ్బాయిని రీమేక్ చేయ‌డం చిరంజీవికి కూడా సంతోషంగానే ఉన్న‌ట్లుంది.. ఎందుకుండ‌దు చెప్పండి..? ఓ న‌టుడి చేతిలోంచి ఆ క‌థ మ‌రో ప‌ర్ ఫెక్ట్ న‌టుడి చేతికి వెళ్లింది క‌దా..!

User Comments