వెంక‌టేష్-తేజ సినిమా ఆగిపోయిందా..?

Last Updated on by

ముందు నుంచి అనుకుంటున్న‌దే..! అంత‌కంత‌కూ రోజులు గ‌డిచిపోతున్నాయి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు వెంక‌టేష్ – తేజ సినిమా మొద‌లు కాలేదు. మ‌రోవైపు బాల‌య్య‌తో చేయాల్సిన ఎన్టీఆర్ బ‌యోపిక్ ద‌గ్గ‌ర ప‌డుతుంది. ఈ చిత్రం ఆగ‌స్ట్ నుంచి ప‌ట్టాలెక్కాలి. ఆ లోపు క‌నీసం గ్రౌండ్ వ‌ర్క్ అయితే చేసుకోవాల్సి వ‌స్తుంది. సూటిగా వెళ్లి పెద్దాయ‌న బ‌యోపిక్ చేయ‌డం అంటే చిన్న విష‌యం కాదు. తేజ‌కు క‌నీసం రెండు నెల‌లైనా టైమ్ కావాలి. కానీ ఆలోపు వెంక‌టేష్ సినిమా పూర్తి చేయ‌డం అంటే మాట‌లు కాదు. ఈ రోజుల్లో ఓ స్టార్ హీరో సినిమా చేయాలంటే క‌నీసం 8 నెల‌లు కావాల్సిందే.. మ‌రీ సూప‌ర్ ఫాస్ట్ గా చేస్తాడంటే ఆర్నెళ్లైనా కావాల్సిందే కానీ మ‌రీ మూడు నెల‌ల్లో సినిమా పూర్తి చేయ‌డం అంటే మాట‌లు కాదు. కానీ ఇప్పుడు ఆ ఛాలెంజ్ ను తీసుకున్నాడు తేజ‌. కానీ ఇప్పుడు అది అంత ఈజీ కాద‌ని అర్థ‌మైపోయిన‌ట్లుంది. అందుకే ప్ర‌స్తుతానికి వెంక‌టేష్ తో సినిమాను తేజ ఆపేసిన‌ట్లుగా తెలుస్తుంది.

ఏప్రిల్ 15 నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెడ‌తామ‌ని మొన్న కూడా చెప్పినా ఇప్పుడు ఆ టైమ్ లేద‌ని అర్థ‌మైపోతుంది తేజ‌కు కూడా. ఎందుకంటే ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అనుకున్న టైమ్ కు మొద‌లు పెట్టాల్సిందే.. ద‌స‌రాకు సినిమా విడుద‌ల కావాల్సిందే అని ప‌ట్టుబ‌డుతున్నాడ‌ని తెలుస్తుంది. దాంతో త‌ప్ప‌క వెంక‌టేష్ సినిమాను తేజ ప‌క్క‌న‌బెట్టేస్తున్నాడు. మ‌రి ఈ స్క్రిప్టుని వేరే ద‌ర్శ‌కుడితో వెంకీ ముందుకు వెళ్తాడా.. లేదంటే తాను క‌మిటైన రెండు మ‌ల్టీస్టారర్స్ తో బిజీగా ఉంటాడా అనేది తేలాల్సి ఉంది. ప్ర‌స్తుతం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో మేన‌ల్లుడు నాగ‌చైత‌న్య‌తో ఓ సినిమా.. అనిల్ రావిపూడితో ఎఫ్ 2 సినిమాలో న‌టిస్తున్నాడు వెంక‌టేష్. ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ మ‌రో హీరోగా న‌టిస్తున్నాడు. మొత్తానికి తేజతో మ‌రోసారి వెంక‌టేష్ కు టైమ్ కుద‌ర్లేద‌న్న‌మాట‌.

User Comments