బన్నీ ప‌రిస్థితి ఏంటి అప్పుడు..?

Last Updated on by

అల్లు అర్జున్ న‌టించిన నా పేరు సూర్య క‌లెక్ష‌న్ల గురించే ఇప్పుడు మ‌నం మాట్లాడుకుంటున్నాం. ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు రెండు రోజుల్లో 28 కోట్ల షేర్ సాధించింది. ఓ భారీ సినిమాకు ఇప్పుడు ఈ వ‌సూళ్లు త‌క్కువే. అందులోనూ వ‌ర‌స విజ‌యాల‌తో జోరు మీదున్న బ‌న్నీ లాంటి హీరోకు ఈ వ‌సూళ్లు త‌క్కువ‌. ఓవ‌ర్సీస్ లో కూడా సూర్య ప‌రిస్థితి అంతగా ఏం లేదు. అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కు హాఫ్ మిలియ‌న్ మాత్రమే దాటింది ఈ చిత్రం.

ప‌రిస్థితి చూస్తుంటే వీకెండ్ లో 35 కోట్ల షేర్ వ‌ర‌కు వ‌చ్చేలా ఉంది. ఆ త‌ర్వాత సినిమా ఎలా ఉంటుంది.. క‌లెక్ష‌న్లు ఎలా వ‌స్తాయి అనేదానిపై సూర్య ఫ్యూచ‌ర్ ఆధార‌ప‌డి ఉంటుంది. ఇప్పుడున్న ప‌రిస్థితిల్లో నా పేరు సూర్య గ‌డ్డు ప‌రిస్థితుల్లోనే ఉన్నాడు. మ‌హాన‌టి.. మెహ‌బూబా కూడా మే 9, 11 తేదీల్లో విడుద‌ల కానున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో సేఫ్ అవ్వాలంటే 80 కోట్లు తీసుకురావాలి సూర్య‌. మ‌రి తీసుకొస్తాడా..? గ‌తంలోనూ యావ‌రేజ్ టాక్ వ‌చ్చిన సినిమాల‌ను త‌న స్టామినాతో బాగానే లాక్కొచాడు బ‌న్నీ. అది ఇప్పుడు కూడా వ‌ర్క‌వుట్ అవుతుందా..?

User Comments