మహేష్ ఆదుకొంటాడా..!

ఇది క‌దా అస‌లు రాక్ష‌సానందం అంటే..! లేక‌పోతే మ‌రేంటి.. త‌ల పగిలి ఏడుస్తుంటే.. ప‌ర్లేదులే చిన్న బొక్కే.. నాకు ఇక్క‌డ త‌ల మొత్తం బొక్కే అన్నాడ‌ట ఒక‌డు. అది చూసి హ‌మ్మ‌య్యా.. నాది నిజంగానే చిన్న బొక్క అని సంతోషప‌డ్డాడ‌ట మ‌రొక‌డు. అచ్చంగా ఇలాగే ఉంది మ‌హేష్, ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల ప‌రిస్థితి చూస్తుంటే. సూప‌ర్ స్టార్స్.. ప‌వ‌ర్ స్టార్స్ ఆఫ్ తెలుగు సినిమాగా పేరు పొందిన ఈ ఇద్ద‌రూ న‌ష్టాలు తేవ‌డంలోనూ పోటీ ప‌డుతున్నారు. మొన్న‌టి వ‌ర‌కు అజ్ఞాత‌వాసే తెలుగులో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అనుకున్నారు కానీ కాదు తానున్నానంటూ స్పైడ‌ర్ వ‌చ్చేసాడు. ముందు ఈ చిత్రానికి 50 కోట్ల న‌ష్టాలు వ‌చ్చాయ‌నుకున్నారంతా. కానీ ఇప్పుడు అన్నీ లెక్కేస్తే 80 కోట్ల లాస్ అని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని అక్ష‌రాలా 124 కోట్లకు అమ్మారు. కానీ వ‌చ్చిన వ‌సూళ్లు మాత్రం 60 కోట్లు. అది కూడా అన్ని భాష‌ల్లో క‌లిపి. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ చిత్ర రైట్స్ 70 కోట్ల‌కు అమ్మారు. కానీ కేవ‌లం 30 కోట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

అంటే ఈ లెక్క‌న 60 శాతం మునిగారు బ‌య్య‌ర్లు. ఓవ‌ర్సీస్ లో కూడా ప‌రిస్థితి ఇలాగే ఉంది. ఇక త‌మిళ‌నాట అయితే 25 కోట్ల‌కు అమ్మితే.. వ‌చ్చింది కేవ‌లం 4 కోట్లే. అక్క‌డ ఈ చిత్రం కొన్న‌ది లైకా ప్రొడ‌క్ష‌న్స్. అక్క‌డా 75 శాతం న‌ష్టాలు వ‌చ్చాయి. ఎక్క‌డ చూసినా ఇప్పుడు స్పైడ‌ర్ ఆర్త‌నాదాలే వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కొన్న బ‌య్య‌ర్లంతా ఇప్పుడు ల‌బో దిబో అంటున్నారు. త‌మ‌ను ఆదుకోవాలంటూ గ‌గ్గోలు పెడుతున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఇంత పెద్ద క‌మ‌ర్షియ‌ల్ డిజాస్ట‌ర్ ఏదీ రాలేదంటే అతిశ‌యోక్తి కాదేమో..! బ్ర‌హ్మోత్స‌వం కూడా ఫ్లాపే కానీ క‌మ‌ర్షియ‌ల్ గా ఇంత‌టి ఫ్లాప్ మాత్రం కాదు. క‌నీసం రెండో రోజు నుంచే క‌లెక్ష‌న్లు కూడా రాబ‌ట్ట‌లేక‌పోయాడు స్పైడ‌ర్. న‌ష్టాలు భ‌రిస్తాం అని చెప్పిన హీరో కానీ.. నిర్మాత కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదంటున్నారు బ‌య్య‌ర్లు. క‌నీసం త‌ర్వాతి సినిమాతో తీరుస్తాం అనే భ‌రోసా కూడా రాలేదు. మొత్తానికి సూప‌ర్ స్టార్ అని న‌మ్మినందుకు సూప‌ర్ గా ముంచి పారేసాడు మ‌హేష్ బాబు. మ‌రి స్పైడ‌ర్ న‌ష్టాల‌ను మ‌హేష్ స్పందిస్తాడో లేదంటే ఎవ‌ర్ని అడిగి కొన్నారు.. మీ ఖ‌ర్మ అని గాలికి వ‌దిలేస్తాడో..!

User Comments