మ‌హేష్ ఎన్నిక‌ల ప్ర‌చారం..!

Last Updated on by

త‌న‌కు అస‌లు రాజ‌కీయాలంటేనే ప‌డ‌వ‌ని చెప్తాడు మ‌హేష్. వాటి గురించి ఏమీ తెలియదంటాడు కూడా. కానీ ఎందుకో తెలియ‌దు కానీ భ‌ర‌త్ అనే నేను చేసిన త‌ర్వాత కాస్త పొలిటిక‌ల్ వైపు మ‌హేష్ అడుగులు ప‌డుతున్నాయి. ఈ మ‌ధ్యే బావ గ‌ల్ల జ‌య‌దేవ్ ను వెంట బెట్టుకుని అన్ని థియేట‌ర్స్ తిరిగాడు. భ‌ర‌త్ పాత్ర కోసం బావ‌ను కూడా ఫాలో అయ్యాడు. దానికితోడు సినిమా విడుద‌ల త‌ర్వాత కేటీఆర్ తో మంత‌నాలు జ‌రిపాడు. ఇవ‌న్నీ చూస్తుంటే మ‌హేష్ కూడా రాజ‌కీయాల వైపు ఆక‌ర్షితుడు అవుతున్నాడేమో అనిపిస్తుంది. అయితే తాను జీవితంలో రాజ‌కీయాల్లోకి రాన‌ని తెగేసి చెప్పాడు సూప‌ర్ స్టార్.

ఇండ‌స్ట్రీలోనే తాను సాధించాల్సింది చాలా ఉంద‌ని.. రాజ‌కీయాల‌కు త‌న ఒంటికి ప‌డ‌వ‌ని చెప్పాడు. అయితే ఒక్క విష‌యంలో మాత్రం ఈయ‌న కాంప్ర‌మైజ్ అయ్యేలా క‌నిపిస్తున్నాడు. అదే బావ గ‌ల్లా జ‌య‌దేవ్. ఈయ‌న కోసం 2019 ఎన్నిక‌ల్లో టిడిపి త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తాడేమో అనే వార్త‌లు వినిపిస్తున్నాయి. అది టిడిపికి స‌పోర్ట్ అనేకంటే బావ కోసం.. బావ క‌ళ్ల‌లో ఆనందం కోసం మ‌హేష్ ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తాడేమో అనిపిస్తుంది. ఎలాగూ మ‌హేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది.. పైగా సోష‌ల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటాడు మ‌హేష్. త‌న బావ‌కు ఓటేయండి అంటూ ఒక్క మాట చెబితే చాలు.. అభిమానులు వినేవాళ్లు కూడా ఉంటారు. అది కూడా ఎంతో కొంత ఓట‌ర్ల‌పై ప్ర‌భావం చూపించ‌క మాన‌దు. చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో..? మ‌హేష్ నిజంగానే ఎన్నిక‌ల ప్ర‌చారం వైపు వ‌స్తాడో లేదో..?

User Comments