ఎన్టీఆర్ బ‌యోపిక్ లో మోహ‌న్ బాబు..?

ఎన్టీఆర్ బ‌యోపిక్.. ఇప్పుడు తెలుగు ఇండ‌స్ట్రీలో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ ఇదే. ఒకేసారి ఇద్ద‌రు పెద్ద మ‌నుషులు ఈ బ‌యోపిక్ ను అనౌన్స్ చేసారు. ఒక‌రు వ‌ర్మ అయితే.. మ‌రొక‌రు ఎన్టీఆర్ వార‌సుడు బాల‌కృష్ణ‌. సాధార‌ణంగా అంద‌రి చూపు బాల‌య్య బ‌యోపిక్ పైనే ఉంటుంది. కానీ అక్క‌డున్న‌ది వ‌ర్మ క‌దా.. త‌క్కువ అంచ‌నా వేయ‌లేం. వ‌ర్మ మ‌న‌సు పెడితే ఎలా ఉంటుందో ర‌క్త‌చ‌రిత్ర పార్ట్ వ‌న్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. అందుకే వ‌ర్మ బ‌యోపిక్ ను కూడా తీసిపారేయ‌లేం. పైగా ఆయ‌న తీసుకున్న కోణం ల‌క్ష్మీపార్వ‌తి ఘ‌ట్టం. అందుకే ఆ బ‌యోపిక్ పై కూడా చాలా ఆస‌క్తి.. అంచ‌నాలున్నాయి. మ‌రో వైపు బాల‌య్య చేయాల‌నుకున్న ఎన్టీఆర్ బ‌యోపిక్ ను తేజ చేతుల్లో పెట్టారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ లో మోహ‌న్ బాబు కూడా న‌టించ‌బోతున్నాడ‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.

ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్ లు రెండున్నాయి. వీటిలో ఏ సినిమాలో మోహ‌న్ బాబు న‌టిస్తార‌నేది తెలియ‌డం లేదు. వ‌ర్మకు మోహ‌న్ బాబుతో మంచి ప‌రిచ‌యం ఉంది.. సాన్నిహిత్యం కూడా ఉంది. ఆ మ‌ధ్య మంచు వారి కంపౌండ్ లోనే ఉంటూ రౌడీ, అనుక్ష‌ణం, అటాక్ లాంటి సినిమాలు చేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఇక బాల‌య్య‌తో మోహ‌న్ బాబు సాన్నిహిత్యం గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. అన్న‌య్య కొడుకు కావ‌డంతో అపురూపంగా చూసుకుంటాడు బాల‌య్య‌ను మోహ‌న్ బాబు. ఈ స‌మ‌యంలో ఎన్టీఆర్ బ‌యోపిక్ అంటే వ‌ర్మ వైపు క‌దులుతాడా.. బాల‌య్య వైపు అడుగేస్తాడా అనేది ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇక్క‌డ మ‌రో విష‌యం కూడా గుర్తించుకోవాలి. తేజ తెర‌కెక్కించే బ‌యోపిక్ లో పెద్ద‌గా వివాదాలేవీ ఉండ‌క‌పోవ‌చ్చు. పైగా అక్క‌డున్నది బాల‌య్య కాబ‌ట్టి అన్నీ తానే ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకుంటాడు. ఇలాంటి సినిమాలో మోహ‌న్ బాబు పాత్రను ఊహించుకున్నా.. ఏదో సాఫ్ట్ రోల్ ఉంటుంది. కానీ అవ‌త‌లి వైపు ఉన్న‌ది వ‌ర్మ‌. పైగా ల‌క్ష్మీపార్వ‌తి కోణం. అంటే క‌చ్చితంగా వివాదాల జోలికే వెళ్తాడు వ‌ర్మ‌. తిప్ప‌లు వ‌స్తాయ‌ని తెలిసినా.. వ‌ర్మ మాత్రం అదే వైపుగా అడుగేయ‌డం ఖాయం. పైగా ఈ దివాళికి పేలిన ట‌పాసుల కంటే వ‌చ్చే ఏడాది ల‌క్ష్మీ ట‌పాసులు ఎక్కువ‌గా పేలుతాయంటూ ట్వీట్ చేసాడు వ‌ర్మ‌. అంటే దీన్ని బ‌ట్టి సినిమా నిండా వివాదాలే ఉంటాయ‌నేది ప‌క్కా. ఇలాంటి సినిమాలో మోహ‌న్ బాబు పాత్ర ఉంటే ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిక‌ర‌మే. పైగా ఇటు చంద్ర‌బాబుతోనూ మోహ‌న్ బాబుకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఇలా వ‌ర్మ‌-బాల‌య్య‌-చంద్ర‌బాబు మ‌ధ్య మోహ‌న్ బాబు నలిగిపోతున్నాడు.