వర్మకు నాగార్జునతో రుణం తిరినట్లేనా..?

Last Updated on by

అనుకున్న‌దే జ‌రిగింది. వ‌ర్మ‌తో అఖిల్ సినిమా ఆగిపోయే ప‌రిస్థితికి వ‌చ్చింది. ఇప్పుడు కానీ వ‌ర్మ‌తో సినిమా చేయ‌డం అంటే కొరివితో త‌ల గోక్కోవ‌డం కాదు.. ఏకంగా త‌ల‌కొరివి పెట్టుకోవ‌డ‌మే. ప్ర‌స్తుతం అలాంటి సిచ్యువేష‌న్ లో ఉన్నాడు ఆర్జీవి. ఈ జీవి చేసిన వింత ప‌నుల‌తో ఇప్పుడు ఇండ‌స్ట్రీ అంతా కాలిపోతున్నారు. మ‌న‌వాడే క‌దా అంటూ ప‌గ‌వాడు అయిపోయాడు. దాంతో ఇండ‌స్ట్రీ అంతా ఈయ‌న్ని దూరం పెట్టాల‌ని ఫిక్స్ అయిపోయింది. ఎలాగూ లీగ‌ల్ గా ఈయ‌న్ని ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు తెలుగు ఇండ‌స్ట్రీలో. ఎందుకంటే ఈయ‌న తెలుగు ద‌ర్శ‌కుడు కాదు.. ఇక్క‌డ జ‌స్ట్ అతిథి అంతే. ఈయ‌న కేరాఫ్ ముంబై. అక్క‌డి ద‌ర్శ‌కుల సంఘంలో స‌భ్యుడు. దాంతో తెలుగు ఇండ‌స్ట్రీతో ఈయ‌నకు సంబంధం లేదు.

ఇప్పుడు వర్మను అడ్డుకోవాలంటే ఇక్క‌డ ఎవ‌రూ ఈయనకు అవ‌కాశాలు ఇవ్వ‌కుండా ఉండ‌టం ఒక్క‌టే చేయాలి. మ‌న ఇండ‌స్ట్రీ పెద్ద‌లు ఇదే సూచిస్తున్నారిప్పుడు. దాంతో అఖిల్ తో వ‌ర్మ చేయాల‌నుకున్న సినిమా కాస్తా ఆదిలోనే ఆగిపోతుందిప్పుడు. నాగార్జున త‌న నిర్ణ‌యాన్ని మార్చుకుని అఖిల్ సినిమాను క్యాన్సిల్ చేసాడ‌ని తెలుస్తుంది. మొత్తానికి తాను చేసిన ప‌నుల‌కు పేరుతో పాటు అవ‌కాశాలు కూడా కోల్పోతున్నాడు వ‌ర్మ‌. అన్న‌ట్లు ఈయ‌న తెర‌కెక్కించిన ఆఫీస‌ర్ మే 25న విడుద‌ల కానుంది. మ‌రి దీని ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతుందో..?

User Comments