Last Updated on by
నాగచైతన్య విషయంలో నాగార్జునకు ఎలాంటి టెన్షన్ లేనట్లుంది. పెద్దబ్బాయి ఎలాగోలా బతికేస్తాడు.. ఆయన సినిమాలు ఆయనకు ఉన్నాయి.. ఏదో ఓ టైమ్ లో స్టార్ అయిపోతాడు లేదంటే ఇలాగే మీడియం రేంజ్ హీరోలా ఉండిపోతాడని మెంటల్ గా ఫిక్సైపోయి చైతూను పట్టించుకోవడమే మానేసాడు నాగార్జున. ఇప్పుడు ఈయన దృష్టంతా చిన్న కొడుకుపైనే ఉంది. ముందు అఖిల్ ను ఎలా స్టార్ గా నిలబెట్టాలని ఆలోచించిన నాగ్.. ఇప్పుడు ఈయన్ని ఎలా నటుడిగా నిలబెట్టాలని ఆలోచిస్తున్నాడు. ముందు నటుడిగా గుర్తింపు వస్తే చాలు.. స్టార్ తర్వాత అని ఫిక్సైపోతున్నాడు. అందుకే చిన్న కుమారుడిపైనే దృష్టంతా పెట్టాడు. ఇప్పటికే ఈయన నటించిన అఖిల్.. హలో డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో ఎలాగైనా ఇప్పుడు అఖిల్ కు హిట్ ఇవ్వడమే పనిగా పెట్టుకున్నాడు నాగ్. ఈ క్రమంలోనే వెంకీ అట్లూరితో మూడో సినిమాను సెట్ చేసాడు.
ఈ సినిమా ఖచ్చితంగా అఖిల్ ఆశల్ని నిలబెట్టేలా ఉంటుందని చెబుతున్నాడు నాగ్. అయితే అంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు నాలుగో సినిమాను మాత్రం వర్మతో ప్లాన్ చేస్తున్నాడు నాగార్జున. అది కూడా నాగ్ నిర్మాణంలోనే ఉంటుందని స్వయంగా వర్మే అనౌన్స్ చేసాడు. దాంతో అభిమానులు కంగారు పడుతున్నారు. అఖిల్ ను తీసుకెళ్లి వర్మ చేతుల్లో పెట్టడం ఏంటని టెన్షన్ పడుతున్నారు. ఇప్పుడు చేస్తోన్న ఆఫీసర్ కానీ తేడా కొడితే ఏంటి పరిస్థితి.. నాగార్జున యుటర్న్ తీసుకుంటాడా లేదంటే ఇచ్చిన మాటకు కట్టుబడి అఖిల్ ను ఆయన చేతుల్లో పెడతాడా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అక్కినేని ఫ్యామిలీకి శివ తర్వాత ఇప్పటి వరకు మరో హిట్ ఇవ్వలేదు వర్మ. అంతం.. గోవిందా గోవిందా.. ప్రేమకథ.. మొన్నటికి మొన్న నాగచైతన్యతో బెజవాడ.. ఇలా వర్మ ఇచ్చింది అన్ని ఫ్లాపులే. మరి ఈ టైమ్ లో ముక్కుపచ్చలారని అఖిల్ ను తీసుకెళ్లి వర్మకు అప్పగించడం ఎంతవరకు సబబో మరి..?
User Comments