నాని అసలు ఆట ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాడా..?

Last Updated on by

అదేంటి.. నాని కెరీర్ ఇప్పుడు సూప‌ర్ స్పీడ్ లో ఉంది క‌దా..! పైగా ఆయ‌న సినిమాలు వ‌ర‌స‌గా బాక్సాఫీస్ ను దున్నేస్తున్నాయి ఇంకే కావాలి అనుకుంటున్నారా..? ఇప్పుడే అస‌లు ఆట మొద‌ల‌వుతుంది ఈ హీరోకు. సినిమా సినిమాకు నెక్ట్స్ లెవ‌ల్ కు వెళ్లిపోతున్నాడు న్యాచుర‌ల్ స్టార్. ప్ర‌స్తుతం ఈయ‌న నాగార్జున‌తో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేస్తున్నాడు. దీనికి ముందే కృష్ణార్జున యుద్ధం విడుద‌ల కానుంది. ఆ త‌ర్వాత విక్ర‌మ్ కే కుమార్, హ‌ను రాఘ‌వ‌పూడి సినిమాలున్నాయి. ఇక్క‌డి వ‌ర‌కు అంతా బాగానే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు నాని ఎంత ఎత్తు ఎదిగినా కూడా ఒక్క రాజ‌మౌళి త‌ప్ప ఈయ‌న‌తో ఏ అగ్ర ద‌ర్శ‌కుడు ప‌ని చేయ‌లేదు. ఎందుకో తెలియ‌దు కానీ నానికి దూరంగానే ఉన్నారు వాళ్లు. ఇక నాని కూడా చిన్న ద‌ర్శ‌కులు.. కొత్త వాళ్ళ‌తోనే స్టార్ అయ్యాడు.

ఇప్పుడు స్టార్ డైరెక్ట‌ర్ల చూపు న్యాచుర‌ల్ స్టార్ పై ప‌డుతుంది. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ఈ హీరోతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ సినిమా అయిన త‌ర్వాత నానితోనే సినిమా ఉండ‌బోతుంద‌ని.. అది కూడా హారిక హాసినిలోనే అని తెలుస్తుంది. ఇక కొర‌టాల శివ‌తో నాని సినిమా అఫీషియ‌ల్ గా క‌న్ఫ‌ర్మ్ అయింది. యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నాని సినిమా ఉండ‌బోతుంది. కొర‌టాల శివ స్నేహితుడు అయిన మిక్కిలినేని సుధాక‌ర్ ఈ చిత్రంతో నిర్మాత‌గా మారుతున్నాడు. ఈ చిత్రాల‌తో పాటు రాజ‌మౌళి కూడా చాలా రోజులుగా నానితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్లుగా తెలుస్తుంది. ఇవ‌న్నీ కానీ వ‌ర్క‌వుట్ అయితే నాని రేంజ్ ఈజీగా 60 కోట్ల‌కు చేరిపోవ‌డం ఖాయం. మ‌రి.. సోలోగానే 40 కోట్ల మార్క్ అందుకున్న నానికి స్టార్ డైరెక్ట‌ర్ తోడైతే ఆ ర‌చ్చ ఎలా ఉంటుందో..?

User Comments