ప్ర‌త్యూష కేసును నిర్భ‌య చ‌ట్టంలోకే తెచ్చే ద‌మ్ముందా?

దిశ‌  ఘ‌ట‌న‌..అటుపై ఆ న‌లుగుర్ని ఎన్ కౌంట‌ర్ లో హ‌త‌మార్చడం దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో?  తెలిసిందే. ఘ‌ట‌న‌కు సంబంధించి కొంత మంది మృగాళ్ల‌కు స‌రైన శిక్ష ఇదేనంటూ హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేసారు. కానీ మ‌రికొంత మంది పోలీసులు చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నార‌ని? ఇదెక్క‌డి న్యాయ‌మంటూ మండిప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో 17 ఏళ్ల  క్రితం న‌టి ప్ర‌త్యూష త్యాచారం, హ‌త్య కేసు మ‌రోసారి తెరపైకి వ‌చ్చింది. ప్ర‌త్యూష త‌ల్లి స‌రోజిని దేవి త‌మ‌కి గానీ, ప్ర‌త్యూష ఆత్మ‌కి ఇంకా శాంతి చేకూర‌లేద‌ని వాపోయింది. అత్యాచారం చేసి, ఆత్మ‌హ‌త్య‌గా చిత్రీక‌రించారని ఆరోపించారు.1

17 ఏళ్ల క్రితం  ప్ర‌జ‌ల్లో ఇంత అవ‌గాహ‌న లేద‌ని, ఇంత టెక్నాల‌జీ కూడా అందుబాటులో లేద‌ని, ఇంత పోరాట ప‌టిమ ఆరోజే ఉండుంటే ప్ర‌త్యూష‌కి న్యాయం జ‌రిగేద‌ని వాపోయింది.  ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వాల‌కి  స‌రోజిని దేవి స‌వాల్ చేసారు. ప్రత్యూష కేసుని నిర్భ‌య చ‌ట్టంలోకి తీసుకురావాల‌ని ? అంత ద‌మ్ము పోలీసుల‌కు , ప్ర‌భుత్వానికి ఉందా? మ‌రోసారి స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టి ప్ర‌త్యూష‌కి న్యాయం చేయాల‌ని  డిమాండ్ చేసారు. అత్యాచార నేర‌స్తుల‌కు ప‌డే శిక్ష‌ల‌పై చ‌ట్టాల‌ను స‌వ‌రించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని?  దిశ ఘ‌ట‌నే ఓ చ్టం కావాల‌ని ఆమె కోరారు.