Will Rajinikanth Political announcement on his Birthday

ర‌జినీ గానీ ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తే..

Will Rajinikanth Political announcement

గ‌త ద‌శాబ్ధ కాలంగా త‌మిళనాట ర‌జినీకాంత్ పై ఉన్న ఒత్తిడి ఇది. అత‌డ్ని రాజ‌కీయాల్లోకి తీసుకురావాల‌ని ఎంతోమంది ట్రై చేస్తున్నారు. చివ‌రికి న‌రేంద్ర‌మోడీ లాంటి వ్య‌క్తి కూడా సూప‌ర్ స్టార్ ద‌గ్గ‌రికి రాయ‌బారిగా వ‌చ్చాడు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు రాజ‌కీయాలు తెలియ‌వ‌ని.. అటువైపు త‌న అడుగు ప‌డ‌ద‌ని చెప్పుకొచ్చాడు ర‌జినీ. కానీ ఇప్పుడు త‌మిళ‌నాట ఓ ర‌క‌మైన రాజ‌కీయ శూన్య‌త ఏర్ప‌డింది. అమ్మ మ‌ర‌ణం.. కుర్చీ కోసం శ‌శిక‌ళ‌, ప‌నీర్ సెల్వం పోరు.. ఇలా ఎటూ దిక్కుతోచ‌ని అనాధ‌లా మారిపోయాయి త‌మిళ రాజ‌కీయాలు. జ‌య‌ల‌లిత ఉన్న‌పుడు త‌మిళ‌నాడు ప‌రిస్థితేంటి అనే ఆలోచ‌న‌లే ఎవ‌రికీ రాలేదు. కానీ ఆమె వెళ్లిపోయిన త‌ర్వాత‌.. ఒక్క‌సారిగా చాలా శూన్యం క‌నిపిస్తోంది అక్క‌డ‌.

ఈ స‌మ‌యంలో ఈ శూన్య‌త‌ను పూడ్చ‌డానికి ఎవ‌రో ఒక బ‌ల‌మైన నాయ‌కుడు రావాలి. ఆ లీడ‌ర్ ర‌జినీకాంత్ ఎందుకు కాకూడ‌ద‌ని ప్ర‌శ్నిస్తున్నారు రాజకీయ విశ్లేష‌కులు. ఇలాంటి స‌మ‌యంలో సూప‌ర్ స్టార్ వ‌స్తే.. ప్ర‌జ‌ల‌కు మంచిదంటున్నారు వాళ్లు. ర‌జినీని రాజకీయాల్లోకి తీసుకురావ‌డానికి చాలా మంది చాలా ర‌కాలుగా ప్ర‌య‌త్నించారు. అన్నింటినీ సున్నితంగా తిర‌స్క‌రించారు ర‌జినీకాంత్. కానీ అప్పుడున్న ప‌రిస్థితులు వేరు.. ఇప్ప‌టి ప‌రిస్థితులు వేరు. ఇప్పుడు గ‌న‌క సూప‌ర్ స్టార్ కాస్త మ‌న‌సు పెడితే రాజ‌కీయంగా శ‌క్తిగా ఎదిగే అవ‌కాశం ఉందంటున్నారు విశ్లేష‌కులు. ర‌జినీకాంత్ మాత్రం ఈ కుళ్లు రాజ‌కీయాలు నాకొద్దు అంటున్నాడ‌ని స‌మాచారం.

ర‌జినీ ఇప్పుడు రాజ‌కీయాల్లోకి రాబోడ‌ని చెప్ప‌డానికి మ‌రో స్ట్రాంగ్ రీజ‌న్ కూడా ఉంది. ఇన్నాళ్ళూ ఎవ‌రెన్ని చెప్పిన రజినీ నో అన్నారు. ఇప్పుడు గానీ తొంద‌ర‌ప‌డి పాలిటిక్స్ లోకి వ‌చ్చారంటే.. అమ్మ‌కు భ‌య‌ప‌డే ఇన్నాళ్లూ సూప‌ర్ స్టార్ దూరంగా ఉన్నాడ‌నే ప్రచారం జ‌రుగుతుంది. ఇదే జ‌రిగితే ర‌జినీకాంత్ ఇమేజ్ కు పెద్ద డ్యామేజ్ జ‌రిగిపోయిన‌ట్లే. ఇవ‌న్నీ ఆలోచించి సూప‌ర్ స్టార్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నాడు. అమ్మ లోటు ఎవ‌రూ పూడ్చలేర‌ని.. త‌న లాంటి వాళ్ల‌కు రాజ‌కీయాలు సూట్ అవ్వవ‌ని విన‌మ్రంగా చెబుతున్నాడు రజినీకాంత్. సూప‌ర్ స్టార్ మ‌న‌సు మార్చి.. ఆయ‌న్ని పాలిటిక్స్ లోకి తీసుకొచ్చే వాళ్లు ఎవ‌రైనా ఉన్నారేమో లేదా ఆయనే మనసు మార్చుకొని వస్తాడో తెలియాలంటే రజినీకాంత్ జన్మదినం వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఆయన జన్మదినం రోజున రాజకీయాల మీద ఒక నిర్ణయం తీసుకొంటారని తెలుస్తుంది.

ర‌జినీ గానీ ఇప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తే..
0 votes, 0.00 avg. rating (0% score)