చరణ్ బోయపాటి కి అంత సీన్ ఉందా..?

Last Updated on by

ఒక్క హిట్ వ‌చ్చేదే ఆల‌స్యం.. ముందు వెన‌క చూడ‌కుండా అమాంతం బిజినెస్ పెంచేస్తారు నిర్మాత‌లు. బ‌య్య‌ర్లు కూడా ముందు హిట్ చూసి ఏదీ ఆలోచించ‌కుండా కొనేస్తుంటారు. అలా చాలా సినిమాల‌కు బోల్తా కొట్టిన సంద‌ర్భాలు కూడా లేక‌పోలేవు. అయినా కూడా అలాగే చేస్తుంటారు డిస్ట్రిబ్యూట‌ర్లు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ సినిమాకు కూడా ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న ప్ర‌స్తుతం బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే 30 శాతం పూర్త‌యింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. మ‌రో ప‌ది రోజుల పాటు ఇక్క‌డే ఫ్యామిలీ సీన్స్ చిత్రీక‌రించ‌నున్నాడు ద‌ర్శ‌కుడు. రంగ‌స్థ‌లం త‌ర్వాత చ‌ర‌ణ్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు కూడా అలాగే ఉన్నాయి. పైగా మాస్ ఎంట‌ర్ టైన‌ర్ కావ‌డంతో బిజినెస్ కు రెక్కలొచ్చేస్తున్నాయి. ఈ చిత్ర హ‌క్కుల్ని 74 కోట్ల‌కు యువీ క్రియేష‌న్స్ కొనేసింద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అది కూడా కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లో మాత్ర‌మే.

బాహుబ‌లి.. అజ్ఞాత‌వాసి త‌ర్వాత అంత‌గా బిజినెస్ చేసిన సినిమా ఇదే. మొన్న రంగ‌స్థ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే 92 కోట్లు వ‌సూలు చేసే స‌రికి ఈ రేట్ ప‌లికింది. అయితే ఇక్క‌డే అస‌లు చిక్కు ఉంది. ఇంత రావాలంటే బోయ‌పాటి సినిమా అద్భుతం సృష్టించాలి. భ‌ర‌త్ అనే నేను 99 కోట్ల‌కు అమ్మినందుకే ఈ చిత్రం 93 కోట్లు వ‌సూలు చేసినా కూడా అబౌ యావ‌రేజ్ అని చెప్పుకోవాల్సి వ‌చ్చింది. ఇక ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే 75 కోట్లు వ‌సూలు చేయ‌డం అంటే మాట‌లు కాదు. దానికి ఇంకా అద్భుతాలు చేయాల్సి ఉంది. మ‌రి అన్ని అద్భుతాలు వ‌ర‌స‌గా రెండోసారి రామ్ చ‌ర‌ణ్ చేస్తాడా..? డివివి దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని హీరోయిన్ గా న‌టిస్తుంది. సంక్రాంతికి సినిమా విడుద‌ల కానుంది. ఇది కూడా ఈజీగా 100 కోట్ల వ‌ర‌కు బిజినెస్ చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. అంతా వ‌సూలు చేయాలంటే మాత్రం చ‌ర‌ణ్ మ‌రో మ‌గ‌ధీర‌.. రంగ‌స్థ‌లం క‌లిపి షో వేయాల్సిందే…! లేదంటే అస‌లుకే మోసం వ‌స్తుంది.

User Comments