శీనువైట్ల‌.. ఇప్పుడుంది అస‌లు ఆట‌..

Last Updated on by

ర‌వితేజతో సినిమా అన‌గానే శీనువైట్ల‌కు పోయిన ప్రాణం లేచి వ‌చ్చినంత ప‌నైంది. ఎందుకంటే వ‌ర‌స డిజాస్ట‌ర్లు వ‌స్తున్న టైమ్ లో మాస్ రాజా నుంచి పిలుపు రావ‌డం మ‌నోడి కెరీర్ కు మ‌ళ్లీ ఊపిరి పోయ‌డ‌మే. అయితే ఇక్క‌డే చిన్న ట్విస్ట్ ఉంది. రాజా ది గ్రేట్ తో హిట్ కొట్టి జోష్ మీదున్న టైమ్ లో శీనువైట్ల క‌థ‌కు ఓకే చెప్పాడు ర‌వితేజ‌. అదే ఊపులో ట‌చ్ చేసి చూడు కూడా పూర్తి చేసాడు.. ఇప్పుడు క‌ళ్యాణ్ కృష్ణ సినిమా చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ట‌చ్ చేసి చూడు విడుద‌లై.. డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఇలాంటి రొటీన్ క‌థ‌లు ర‌వితేజ ఎందుకు చేస్తున్నాడంటూ విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. దాంతో క‌ళ్యాణ్ కృష్ణ‌పై ఒత్తిడి పెరిగింది.

ఇదే టైమ్ లో శీనువైట్ల సినిమాపై కూడా మ‌ళ్లీ ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్లుగా తెలుస్తుంది. ఈ క‌థ‌ను మ‌రోసారి పూర్తిగా రీ రైట్ చేయాల్సిందిగా కోరాడు మాస్ రాజా. పైగా ఇది మామూలు క‌థ కాదు.. ఇందులో ర‌వితేజ మూడు పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నాడు. అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ త‌ర‌హా క‌థ ఇది. టైటిల్ కూడా అదే. అయితే క్యాచీగా ఉంటుంద‌ని అ..అ..అ అని పెడుతున్నాడు శీనువైట్ల‌. ఈ క‌థ‌పైనే ప్ర‌స్తుతం కుస్తీ ప‌డుతున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అన్నీ కుదిర్తే ఏప్రిల్లో ప‌ట్టాలెక్క‌డం ఖాయం. కానీ అప్ప‌టి వ‌ర‌కు ర‌వితేజ మ‌న‌సు మార‌కుండా ఉంటుందా అనేది అస‌లు అనుమానం. మారితే మాత్రం శీనువైట్ల‌కు మ‌ళ్లీ బ్యాండ్ త‌ప్ప‌దు. అస‌లే మిస్ట‌ర్ వ‌చ్చి ఏడాది అవుతున్నా ఏ హీరో ఈయ‌న్ని క‌రుణించ‌డం లేదు. ఇప్పుడు గానా మాస్ రాజా హ్యాండిస్తే వైట్ల ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మార‌డం ఖాయం.

User Comments