హీరో హీరోయిన్ గొడవ.. మధ్యలో సినిమా?

క‌ణం.. తెలుగు సినిమా కాదు.. కానీ తెలుగులో కూడా ఈ చిత్రంపై మంచి అంచ‌నాలున్నాయి. దానికి కార‌ణం సాయిప‌ల్ల‌వి. ఫిదా అనే ఒక్క సినిమా తోనే కావాల్సినంత ఇమేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఆ త‌ర్వాత ఎంసిఏతో మ‌రో సూప‌ర్ హిట్ అందుకుంది. ఈ రెండు సినిమాల్లో సాయిప‌ల్ల‌విది కీ రోలే. ఇక ఇప్పుడు క‌ణం సినిమాతో వ‌స్తుంది. ఇందులో నాగ‌శౌర్య‌తో క‌లిసి న‌టించింది సాయిప‌ల్ల‌వి. ఫిబ్ర‌వ‌రి 23న సినిమా విడుద‌ల కానుంది. ఈ మ‌ధ్యే సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. యు బై ఏ స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. ఏఎల్ విజ‌య్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఎన్నాళ్ల నుంచో తీర‌ని స‌మ‌స్య‌గా ఉన్న బ్రూణ హ‌త్య‌ల నేప‌థ్యంలో ఈ క‌థ తెర‌కెక్కింది. ట్రైల‌ర్ చూస్తుంటేనే సినిమాపై అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. పైగా సాయిప‌ల్ల‌వి న‌ట‌న సినిమాకు మ‌రో హైలైట్ కానుంది.

ఇదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు క‌ణం సినిమాను తెలుగులో ప్ర‌మోట్ చేయ‌డానికి సాయిప‌ల్ల‌వి వ‌స్తుందా రాదా అనేది మ‌రో ఎత్తు. ఎందుకంటే త‌న జీవితంలో ఎవ‌రైనా హీరోయిన్ తో ప‌ని చేయ‌కూడ‌దు అనుకుంటే అది సాయిప‌ల్ల‌వి అని చెప్పాడు నాగ‌శౌర్య‌. త‌న‌ను బాగా ఇబ్బంది పెట్టిన హీరోయిన్ సాయిప‌ల్ల‌వి అంటూ ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు శౌర్య‌. ఇలాంటి టైమ్ లో ఈయ‌న‌తో క‌లిసి తెలుగులో క‌ణం సినిమాను సాయిప‌ల్ల‌వి ప్ర‌మోట్ చేస్తుందా అనేది అనుమాన‌మే. ఎందుకంటే ఎంసిఏ సినిమానే ప‌ట్టించుకోలేదు సాయిప‌ల్ల‌వి. త‌న పాత్ర‌ను క‌ట్ చేసినందుకు హ‌ర్ట్ అయింది అని కొంద‌రు.. లేదు నానితో గొడ‌వైంద‌ని ప్ర‌మోష‌న్స్ కు రాలేద‌ని మ‌రికొంద‌రు చెప్పారు. కార‌ణం ఏదైనా సాయిప‌ల్ల‌వి ఇగో హ‌ర్ట్ అయింద‌క్క‌డ‌. ఇక ఇప్పుడు క‌ణం సినిమాకు నాగ‌శౌర్య కావాల్సినంత హ‌ర్ట్ చేసాడు ఈ భామ‌ను. మ‌రి ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో శౌర్య‌తో కలిసి సాయిప‌ల్ల‌వి ప్ర‌మోట్ చేస్తుందో లేదో చూడాలి..ఒక‌వేళ చేస్తే క‌లిసి ఎలా ఉంటారో మ‌రి..?

User Comments