మ‌హేష్ కి త‌రుణ్ భాస్క‌ర్ గాలం

ఇటీవ‌ల కాలంలో ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ల‌ను సూప‌ర్ స్టార్ మహేష్ బాబు వెతికి మ‌రీ ప‌ట్టుకుంటున్నాడు. సీనియ‌ర్ల క‌న్నా! జూనియ‌ర్లు మేల‌ని కాస్త సృజ‌నాత్మ‌క‌త.. మేకింగ్ తెలుసుంటే? త‌న బ్రాండ్ ఇమేజ్ తో సినిమా చేసి స‌క్సెస్ కొట్టొచ్చ‌నే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన మ‌హేష్ ఇప్పుడు ప్ర‌తిభ గ‌ల యవ ద‌ర్శ‌కుల వైపే  ఆస‌క్తి చూపిస్తున్నాడు. ఇప్ప‌టికే అర్జున్ రెడ్డితో స‌క్సెస్ కొట్టిన సందీప్ వంగాను లైన్ లో ఉన్నాడు.  అలాగే ఇటీవ‌లే `కేజీయ‌ఫ్` తో బ్లాక్ బ‌స్టర్ కొట్టిన ప్ర‌శాంత్ నీల్ తోనూ అగ్రిమెంట్ చేసుకున్నాడు. 2021లో ఆ కాంబినేష‌న్ లో సౌత్ లో అన్ని లాంగ్వెజెస్ లో ఆ చిత్రం రూపొందించ‌నున్నారు. దీన్ని స్వ‌యంగా మ‌హేష్ బాబు భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌బోతున్నాడు.

ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన మ‌రో యువ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ కూడా మ‌హేష్ కి గాలం వేసే ప‌నిలో ప‌డ్డ‌ట్లు క్లోజ్ సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త‌ను త‌రుణ్ క‌లిసి స్టోరీ లైన్ వినిపించిన‌ట్లు ఆమె ఇంప్రెస్ అయిన‌ట్లు స‌న్నిహితుల నుంచి తెలిసింది. మ‌హేష్ ను  త‌రుణ్ డైరెక్ట్ చేసే అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉన్నాయ‌ని బ‌ల‌మైన వాద‌న వినిపిస్తోంది . `పెళ్లి చూపులు`, `ఈ న‌గ‌రానికిఏమంది` వంటి చిత్రాల‌తో ద‌ర్శ‌కుడిగా ప‌ర్వాలేద‌నిపించాడు త‌రుణ్. తొలి సినిమా మంచి ఫ‌లితాలిచ్చినా…రెండ‌వ సినిమా మాత్రం ఆశించిన రిజ‌ల్ట్ ఇవ్వ‌లేదు. ప్ర‌స్తుతం `ఫ‌ల‌క్ నుమా దాస్` అనే సినిమాతో నుటుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇంత‌లో మ‌హేష్ తో మూవీ అంటూ వెలుగులోకి రావ‌డం విశేషం.