ఫ్లాప్ హీరోకి 100ప‌ర్సంట్ హిట్టిస్తారా?

Flop Hero Says Chaavu Kaburu Challaga

వ‌రుస ఫ్లాపుల‌తో కెరీర్ ప‌రంగా చిక్కుల్లో ప‌డ్డాడు యంగ్ హీరో కార్తికేయ‌. హిప్పీ-గ్యాంగ్ లీడ‌ర్-90ఎంఎల్ వ‌రుస‌గా ఫ్లాపులుగా నిలిచాయి. 90ఎంఎల్ క‌లెక్ష‌న్స్ ఫ‌ర్వాలేద‌నిపించినా.. ఆశించిన హిట్ట‌యితే కాలేదు. అందుకే ఇప్పుడు కెరీర్ ప‌రంగా ఆచితూచి అడుగులేయాల్సిన ప‌రిస్థితి.

ఇలాంటి స‌న్నివేశంలో గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ లో సినిమాని ద‌క్కించుకున్నాడు ఈ యంగ్ హీరో. గీతా ఆర్ట్స్ 2లోనే నాగ‌చైత‌న్య‌కు 100 ప‌ర్సంట్ ల‌వ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌క్కింది. ఇప్పుడు కార్తికేయ‌కు అలాంటి హిట్టు ప‌డాల్సిన సంద‌ర్భం ఉంది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో ఈ చిత్రాన్ని బ‌న్ని వాసు నిర్మిస్తున్నారు. చావు క‌బురు చ‌ల్ల‌గా..! అనేది టైటిల్. కౌశిక్ పి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇందులో కార్తికేయ బ‌స్తీ బాల‌రాజుగా న‌టిస్తున్నారు.