Will Venkatesh scenes help to agnyathavaasi business?

వెంకటేష్ తో.. ఏదైనా లాభం ఉంటుందా..?

Will Venkatesh scenes help to agnyathavaasi business?

ఈ మ‌ధ్య కాలంలో ఏ సినిమాకు రానంత బ్యాడ్ టాక్ తెచ్చుకుంది అజ్ఞాత‌వాసి. ఈ చిత్రం ఇంత‌గా నిరాశ ప‌రుస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. అస‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పండ‌గ‌ను పూర్తిగా ద‌త్త‌త తీసుకుంటాడేమో అనుకుంటే.. పూర్తిగా చేతులెత్తేసాడు. సినిమాకు ఇంత దారుణ‌మైన టాక్ వ‌చ్చినా.. ప‌ట్టించుకున్న పాపాన పోని ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇప్పుడు గాయంపై ఆయింట్ మెంట్ రాస్తున్నారు. ప‌వ‌న్.. త్రివిక్ర‌మ్ లాంటి కాంబినేష‌న్ లో సినిమా అంటే ఎలా ఉంటుందో ప్రేక్ష‌కుల‌కు కొన్ని అంచ‌నాలు ఉంటాయి. కానీ సినిమా చూసిన త‌ర్వాత అన్నీ త‌ల‌కిందులు అయిపోయాయి. అస‌లు ఇదివ‌ర‌కు త్రివిక్ర‌మ్ ఇలాంటి త‌ల‌తోక లేని సినిమా ఏదీ చేయ‌లేదు. ఆయ‌న సినిమాల్లో ఓ థీమ్ ఉంటుంది. ఖ‌లేజా లాంటి సినిమాలోనూ కామెడీకి ఢోకా ఉండ‌దు. అలాంటిది అజ్ఞాత‌వాసిలో మాత్రం ఇష్ట‌మొచ్చిన‌ట్లు తీసాడు త్రివిక్ర‌మ్. నేను రాసిందే డైలాగ్.. తీసిందే సీన్.. చేసిందే సినిమా అన్న‌ట్లుంది ఈ చిత్ర ప‌రిస్థితి.

ప‌వ‌న్ తో వేయించిన బృహ‌న్న‌ల వేశాల వెన‌క ఉన్న ప‌ర‌మార్థం ఏంటో కూడా త్రివిక్ర‌మ్ కే తెలియాలి మ‌రి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంటి హీరో నుంచి ఇలాంటి స‌మ‌యంలో ఇది రావాల్సిన సినిమానా అంటూ నిల‌దీస్తున్నారు వాళ్లు..! పైగా సినిమాలో ప‌వ‌న్ వేసిన ఆ వేషాలు చూసి అరే.. అస‌లు ఇదేంటి ఇలా చేస్తున్నాడు అంటున్నారు. ఇక ఇప్పుడు ఇంత జ‌రిగిన త‌ర్వాత వెంకటేష్ సీన్స్ యాడ్ చేస్తున్నారు. సినిమాలో ఓ సీన్ వెంకీ వ‌స్తాడు.. వ‌చ్చి ప‌వ‌న్ తో గ‌బ్బ‌ర్ సింగ్ తిక్క డైలాగ్ చెప్తాడు. ఆ సీన్స్ ఇప్పుడు యాడ్ చేస్తున్నారు. దాంతో పాటు మొత్తం 7 నిమిషాల సీన్ బ‌య‌టికి వ‌స్తుంది. అవి చేసినా ఇప్పుడు క‌లెక్ష‌న్లు పెరుగుతాయ‌నే న‌మ్మ‌కం అయితే ఎవ‌రిలోనూ క‌నిపించ‌ట్లేదు.

అజ్ఞాత‌వాసి దారుణ‌మైన ఫ‌లితానికి అస‌లు కార‌ణం ఏంటి..? ఈ లోపం ప‌వ‌న్ లో ఉందా.. లేదంటే త్రివిక్ర‌మ్ లో ఉందా..? క‌నీసం చూసుకోలేదా..? ఇంత ప్ర‌స్టేజియ‌స్ ప్రాజెక్ట్.. పైగా 120 కోట్ల బిజినెస్ చేసిన సినిమాను ఇంత దారుణంగా ఎలా తీస్తారు.. అని ప్ర‌శ్నిస్తున్నారు ఇప్పుడు మ‌న‌సు మండిన అభిమానులు. ప‌వ‌న్ 25వ సినిమా క‌దా అని కోట్లాది ఆశ‌ల‌తో వ‌చ్చిన అభిమానుల ఆశ‌ల‌పై నిండా నీళ్లు పోసారు ప‌వ‌న్ అండ్ త్రివిక్ర‌మ్. ఏం చేసినా చూస్తారులే అనే అతి విశ్వాస‌మే ఇప్పుడు అజ్ఞాత‌వాసి కొంప ముంచేసిందేమో అనిపిస్తుంది కాస్త లోతుగా జాగ్ర‌త్త‌గా ఆలోచిస్తే..! ఈ పాపం ఎవ‌రిది అయినా కానీ ఇప్పుడు మునిగేది మాత్రం బ‌య్య‌ర్లే. ఇప్పుడు సంక్రాంతి నుంచి వెంకటేష్ సీన్స్ యాడ్ చేస్తున్నారు. మ‌రి క‌నీసం ఈ సీన్స్ కాస్తైనా న‌ష్టాన్ని భ‌ర్తీ చేస్తాయా..?

వెంకటేష్ తో.. ఏదైనా లాభం ఉంటుందా..?
0 votes, 0.00 avg. rating (0% score)