“మా” నిర్ణయం పని చేస్తుందా..?

Last Updated on by

కుక్క‌లు చింపిన విస్త‌రు అంటాం క‌దా అలా ఉండేది ఇదివ‌ర‌కు మా అసోసియేష‌న్ ప‌రిస్థితి. ఎవ‌రికి క‌ష్ట‌మొస్తే ఎవ‌రికి కంప్లైంట్ చేయాలో తెలియ‌ని ప‌రిస్థితి. ఎవ‌రి కోసం ఎవ‌రొచ్చి మాట్లాడ‌తారో లేని క్లారిటీ.. అంతా క‌న్ఫ్యూజ‌న్ లోనే ఇన్నాళ్లూ బ‌తికేసారు మా స‌భ్యులు. కానీ ఈ మ‌ధ్య ఇష్యూస్ చాలా సీరియ‌స్ అయ్యాయి. మా అసోషియేష‌న్ అస్థిత్వంపైనే మ‌చ్చ వ‌చ్చేలా త‌యారైంది ప‌రిస్థితి. దాంతో మా వాళ్లు కూడా ఇప్పుడిప్పుడే మార్పు కోరుకుంటున్నారు. వాళ్లలో కూడా యూనిటి ఉంద‌ని నిరూపించుకుంటున్నారు.

ఇక‌పై ఎవ‌రూ మా వైపు వేలెత్తి చూపించ‌కుండా కొన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఈ మధ్యే తీసుకొన్న నిర్ణయం ఇక నుంచి మా అసోసియేష‌న్ నుంచి ప్ర‌తీ డిపార్ట్ మెంట్ కు ఒక స్పోక్స్ ప‌ర్స‌న్ ఉంటాడు. అంటే అత‌డి డిపార్ట్ మెంట్ కు అత‌డే జ‌వాబుదారి అన్న‌మాట. ఉదాహ‌ర‌ణ‌కు ఎవ‌రైనా వ‌చ్చి త‌మ‌కు రెమ్య‌న‌రేష‌న్ స‌రిగ్గా అంద‌డం లేదంటే అంతా వెళ్లి మాట్లాడ‌కూడ‌దు. ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే జ‌రిగింది. కానీ ఇప్ప‌ట్నుంచీ అది కుద‌ర‌దు.

ఎవ‌రైతే ఆ రెమ్యున‌రేష‌న్ కు సంబంధించిన వాళ్లు ఉంటారో.. అత‌డే వెళ్లి మాట్లాడ‌తాడు. ప్ర‌తీ చిన్న విష‌యానికి మా అంతా ముందుకొచ్చి విమ‌ర్శ‌ల పాల‌వ్వ‌డం ఈ మ‌ధ్య ఆన‌వాయితీ అయిపోయింది. దాంతో మా అసోసియేష‌న్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. మ‌రి.. ఈ తీసుకున్న కొత్త నిర్ణ‌య‌మైనా వాళ్లకు మంచి పేరు తీసుకొస్తుందో లేదో..?

User Comments