Last Updated on by
ఒక్క వింక్ యాక్టివిటీతో ప్రపంచవ్యాప్తంగా పాపులరైన నవతరం బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. ఒరు ఆధార్ లవ్ చిత్రంతో తొలి అడుగులు వేసింది. ఇప్పుడు ఆ సినిమా తెలుగు రాష్ట్రాల్లో `లవర్స్ డే` పేరుతో ఫిబ్రవరి 14న విడుదలవుతోంది. కన్న గీటితో బన్ని అంతటివాడే తనకు వీరాభిమానిగా మారిపోయాడు. అందుకే లవర్స్ డే ఆడియో వేడుకకు అతిధిగా విచ్చేశాడు. ప్రియాకి ఓ సినిమాలోనూ ఇదివరకూ ఛాన్సిచ్చేశాడు. మొత్తానికి ప్రియా ప్రకాష్ కి ఇకపై టాలీవుడ్ లోనూ చక్కని భవిష్యత్ ఉంటుందనడంలో సందేహం లేదు. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి షాన్ రెహమాన్ సంగీతం అందించాడు.
హైదరాబాద్ లో జరిగిన ఆడియో వేడుకలో ప్రియా ప్రకాష్ తనవైన అందచందాలతో కుర్రకారును కవ్వించింది. బన్నిపై గన్ ఎక్కు పెట్టి మరోసారి బుట్టలో వేసేసింది. ప్రియా కవ్వింత తుళ్లింతకు ఫిదా కాని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు ఈ వేడుకలో ప్రియా మెడకు దిగువగా ఎడమవైపుగా ఉన్న ఓ టాట్టూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ పచ్చబొట్టులో ఉన్న అక్షరాలేంటో అర్థంగాక జనం కన్ప్యూజన్ కి గురయ్యారు. అయితే ఆ టాట్టూలో `కార్పర్ డియమ్`(Carper Diem) అని రాసి ఉంది. ఈ పదానికి లాటిన్ అర్థం వర్తమానంలో జీవించండి.. భవిష్యత్ గురించి కనీస నమ్మకంతో జీవించండి అనే అర్థం వస్తుందిట. మొత్తానికి ప్రియా భవిష్యత్ గురించి చాలానే హోప్స్ తోనే ఉందని ఈ పచ్చబొట్టు చెబుతోందన్నమాట!!
User Comments