చంద్ర‌బోస్ ఇంట్లో విషాదం

గీత ర‌చ‌యిత చంద్ర‌బోస్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న మాతృమూర్తి మ‌ద‌న‌మ్మ సోమ‌వారం క‌న్ను మూసారు. గుండెపోటు రావ‌డంతో హైద‌రాబాద్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చంద్ర‌బోస్ స్వ‌గ్రామం వ‌రంగ‌ల్ జిల్లాలోని చ‌ల్ల‌గిరి మ‌ద‌న‌మ్మ‌కు న‌లుగురు సంతానం. అందులో చివ‌రి వాడు చంద్ర‌బోస్. సినిమాల‌పై మ‌క్కువ‌తో బోస్ రంగుల ప్ర‌పంచ వైపు అడుగులు వేసి రైట‌ర్ గా స్థిర‌ప‌డ్డారు. కాగా మ‌ద‌న‌మ్మ మృతిప‌ట్ల ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేసారు. నేటి సాయంత్ర మ‌ద‌న‌మ్మ అంత్య క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. అలాగే సీనియ‌ర్ న‌టుడు రాళ్ల‌ప‌ల్లి మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. కాగా ఆయ‌న అంత్య క్రియ‌లు నేడు మ‌హాప్ర‌స్తానంలో పూర్త‌య్యాయి.