జ‌న‌సేనానిపై రైట‌ర్ చిన్నికృష్ణ వీరంగం

Last Updated on by

“హైద‌రాబాద్‌లో ఆంధ్రా వాళ్ల‌ని ప‌రిగెత్తిచ్చి కొడుతున్నారు. మ‌న వాళ్ల‌కి అక్క‌డ ర‌క్ష‌ణ లేదు. ఏపీ రాజ‌కీయాల్లో కేసీఆర్ త‌ల‌దూర్చొద్దు. మాకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వొద్దు!“ అంటూ నిన్న కృష్ణాజిల్లా లో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చ‌రంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ సీరియ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. దీనిపై రైట‌ర్ చిన్న‌కృష్ణ కౌంట‌ర్ గా స్పందించారు. నేను నోరు తెరిస్తే ప‌వ‌న్ న‌వ‌రంధ్రాలు మూసుకోవాల్పిందే. మీరు, మీ కుటుంబం ఏ పార్టీతో చేతులు క‌లిపారో ఆ పార్టీ స‌భ్యులంద‌రికి కూడా పేరు పేరున చెబుతున్నాను. నా నోరు తెరిపించే ప‌నిచేయొద్ద‌ని హెచ్చ‌రిస్తున్నాను అని చిన్నికృష్ణ అన‌డం సంచ‌ల‌నంగా మారింది.

మీ రాజ‌కీయాల కోసం హైద‌రాబాద్‌లో వున్న ఆంధ్రుల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడ‌తారా?. ఎన్నిక‌ల్లో పోటీ చేస్తూ మీ సిద్ధాంతం ఏంటో చెప్పండి. జ‌గ‌న్‌లాగే మీరూ పార్టీ పెట్టుకున్నారు. ప్ర‌జ‌ల‌కు మీరేం చేస్తారో చెప్పండి.. కానీ జ‌గ‌న్‌పై నింద‌లేస్తారా? కోడి క‌త్తిపై విషం చిమ్ముతారు. అత‌నికి అత‌నే పొడిపించుకున్నాడంటారు. బాబాయ్ హ‌త్య జ‌రిగితే జ‌గ‌న్‌పైనే నెట్టేసే ప్ర‌య‌త్నం చేస్తారు. రేపు జ‌గ‌న్ త‌న‌కు తానే విషం తాగి చ‌నిపోయాడ‌ని అంటారేమో. ఆంధ్రా ఓట‌ర్లు ఎటు వైపు ఉన్నారో మే ఎన్నిక‌ల్లో తెలుస్తుంది. ఫ‌లితాల రోజు టీవీ ముందు కూర్చున్న మీకు గుండెలు ప‌గిలే నిజం బ‌య‌టికి వ‌స్తుంది. అంత మెజారిటీతో జ‌గ‌న్ గెల‌వ‌బోతున్నాడు అంటూ ఫైర‌య్యారు చిన్నికృష్ణ‌.

User Comments