షాక్.. పవన్ కళ్యాణ్ ను వాళ్ళతో పోల్చాడు..! 

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమాలకు అతీతంగా ఉన్న ఇమేజ్ గురించి తెలుగునాట అందరికీ తెలుసు. ముఖ్యంగా జనసేన అధినేతగా, ఓ సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా, మంచి మనస్సు ఉన్న సగటు మనిషిగా.. పవన్ ను జనాలు ఎప్పుడూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఇక ఆయన అభిమానులు అయితే, పవన్ పేరు చెబితే చాలు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతారు. అందుకే పవన్ గురించి ఎవరైనా మాట్లాడాల్సి వస్తే.. అది ప్రశంసాపూర్వకం అయినా, విమర్శనాత్మకం అయినా సరే వేరే లెవెల్ లో ఉంటుంది. అందులోనూ కొంచెం పేరున్న సెలబ్రిటీలు అయితే చాలు, పవన్ గురించి ఏమన్నా సరే బల్లగుద్ది మరీ చెప్పినట్లు మాట్లాడతారు.
ఇప్పుడు ఈ సోదంతా ఎందుకంటే, తాజాగా ఇలానే టాలీవుడ్ స్టార్ రైటర్ గా ఓ టైమ్ లో బాగానే పేరు తెచ్చుకున్న చిన్ని కృష్ణ ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసి వార్తల్లో హైలైట్ అయిపోయారు. అయితే, ఇక్కడ షాకింగ్ కామెంట్స్ అంటే, పవన్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చే కామెంట్స్ అనుకుంటే పొరపాటు పడినట్లే. ఎందుకంటే, ఆయన పవన్ ను ఆకాశానికి ఎత్తేయాలనే ఉద్దేశ్యంతో.. ప్రపంచం చేత గొప్పవాళ్లుగా కిర్తించబడ్డ వాళ్ళతో పవన్ ను పోల్చారు కాబట్టి. దీనికంటే ముందు ఆ తాజా ఇంటర్వ్యూలో అసలు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగితే.. దానికి చిన్ని కృష్ణ ఎమోషనల్ అయిపోవడం విశేషం.
ఇక ఆ తర్వాతే పవన్ పై ప్రశంసల జల్లు కురిపిస్తూ.. పవన్ కళ్యాణ్ ఓ మదర్ థెరిసా, గౌతమ బుద్ధుడు అతంటి గొప్ప వ్యక్తి అంటూ చిన్ని కృష్ణ చెప్పుకొచ్చారు. అలాగే భారత జాతి లోనే పవన్ ఓ అరుదైన వ్యక్తి అని అన్నారు. ఇక అక్కడితో ఆగకుండా.. ఎంతటి క్రూర స్వభావం కలిగిన వ్యక్తి మనస్సునైనా పవన్ కళ్యాణ్ బాధించడని, ఏదో ఒక రోజు పవన్ దేశానికే ఐకానిక్ పొలిటీషియన్ గా మారతాడని చిన్ని కృష్ణ స్పష్టం చేయడం విశేషం. చివరగా దీనిని ఆపడం ఎవరి వల్లా కాదని చిన్ని కృష్ణ తేల్చి చెప్పడం గమనార్హం. ఇదిలా ఉంటే, రచయిత చిన్ని కృష్ణ ఇప్పటివరకు ఇంద్ర, నరసింహ నాయుడు, గంగోత్రి, బద్రీనాథ్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన విషయం తెలిసిందే.