ర‌చ‌యిత సూసైడ్ నేర్పిన పాఠం

Last Updated on by

సినీప‌రిశ్ర‌మలో ర‌చ‌యిత‌ల ప‌రిస్థితి ఎంత‌టి ధైన్యమో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నేలేదు. ర‌చ‌యిత‌ల‌కు జీతాలు ఉండ‌వు. భ‌ద్ర‌త అస‌లే ఉండ‌దు. ర‌చ‌యిత‌ల సంఘం అని హైద‌రాబాద్‌-ఎల్లారెడ్డి గూడ‌లో ఒక అసోసియేష‌న్ ఉన్నా.. అది కేవ‌లం నామ‌మాత్ర‌మేన‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక్క‌డ అంద‌రూ కొర‌టాల శివ‌, త్రివిక్ర‌మ్, వ‌క్క ంతం కాలేరు.  ఇక్క‌డ రైట‌ర్లుగా నిలదొక్కుకోవ‌డం అంత సులువేం కాదు. చిన్నా చిత‌కా ర‌చ‌యిత‌లు అయితే కేవ‌లం పెద్ద ర‌చ‌యిత‌ల కింద ఘోస్ట్‌లుగా న‌లిగిపోవాల్సి ఉంటుంది. ఇక మీడియం రేంజ్ ర‌చ‌యిత‌ల క‌ష్టాలు వేరొక ర‌కంగా ఉంటాయి. ఇండ‌స్ట్రీలో అప్ప‌టికే పేరొచ్చేస్తుంది కాబ‌ట్టి ఆదాయం లేక‌పోయినా వీళ్ల రేంజు అటు సెల‌బ్రిటీకి, ఇటు కామ‌న్ మ్యాన్‌కి మ‌ధ్య మిగిలిపోతుంది. ఈ బుధ‌వారం రాత్రి వ‌ర్ధ‌మాన ర‌చ‌యిత రాజ‌సింహా ముంబైలోని ఆయ‌న అపార్ట్‌మెంట్‌లో ఆత్మ‌హ‌త్యా య‌త్న ం చేయ‌డాన్ని బ‌ట్టి ఇండ‌స్ట్రీ తెలుసుకోవాల్సింది చాలానే ఉంది.

అన‌గ‌న‌గ ఓ ధీరుడు, రుద్ర‌మ‌దేవి చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌ని చేసిన రాజసింహ చాలాకాలంగా ముంబయిలో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా ఛాన్సులు రాక మాన‌సికంగా కుంగిపోయి.. అటుపై ఒత్తిడిని భ‌రించ‌లేని స్థితిలో  నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయ‌త్న ం చేశారు. ప్రస్తుతం ఆయన ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌ని తెలుస్తోంది. `రుద్రమదేవి` సినిమాలో గోన‌గ‌న్నారెడ్డి పాత్ర‌కు తెలంగాణ యాసలో చ‌క్క‌ని డైలాగులు రాశారని అల్లు అర్జున్‌ ఓ కార్యక్రమంలో రాజసింహను ప్రశంసించారు.  సందీప్‌ కిషన్‌ నటించిన ‘ఒక అమ్మాయి తప్ప’ సినిమాకు రాజసింహ దర్శకత్వ ం వహించారు. ఇక‌పోతే రాజ‌సింహా త‌ర‌హాలో ఎంద‌రో ఇక్క‌డ‌. స‌రైన ఆదాయం లేక‌, పూర్తిగా సెల‌బ్రిటీ హోదాని ఆస్వాధించ‌లేక న‌లిగిపోతూ ఒత్తిడిలో కుంగిపోయేవారెంద‌రో ఇక్క‌డ‌. ఈ ఇండ‌స్ట్రీ దోసిట ప‌ట్టిన వాడికి ప‌ట్టినంతా లాగేస్తారు. ప‌ట్ట‌లేక‌పోతే మ‌రో రాజ‌సింహాలా మిగిలిపోతారు.

User Comments