స‌ల్మాన్ పెళ్లి.. ఏక్తా లొల్లి..!

ఏక్తాక‌పూర్.. బాలీవుడ్ లో ఈ పేరు తెలియ‌ని వాళ్లంటూ ఉండ‌రు. ఈమె ఏదో హీరోయిన్ కాదు.. నిర్మాత అంతే. కాక‌పోతే అంతా మంచి కాన్పెప్ట్ ఉన్న సినిమాలు తీసి నిర్మాత‌లుగా గుర్తింపు తెచ్చుకోవాల‌నుకుంటారు. కానీ ఎక్తాక‌పూర్ మాత్రం కేవ‌లం సెక్స్ సెక్స్ అంటూ ఉంటుంది. ఈమె నిర్మించే సినిమాల‌న్నింట్లోనూ ఉండే కామ‌న్ కాన్సెప్ట్ సెక్స్. ప్రేక్ష‌కుల వీక్ నెస్ మీద డ‌బ్బులు సంపాదించ‌డం ఎక్తా స్పెషాలిటీ. బాలాజీ మోషన్ పిక్చర్స్ అంటూ పెద్ద బ్యానరే ఉంది ఈమెకు. వ‌య‌సు 40 దాటినా ఇప్ప‌టికీ పెళ్లి ఊసెత్త‌డం లేదు ఏక్తాక‌పూర్. అడిగితే విచిత్రంగా స‌ల్మాన్ ఖాన్ కు లింక్ పెట్టేసింది. ఇప్ప‌టికీ స‌ల్మాన్ కు ఇంకా పెళ్లి కాలేదు క‌దా.. 50 దాటినా ఇంకా ఆయ‌న అలాగే ఉన్నాడు.

స‌ల్మాన్ పెళ్లి చేసుకున్న రెండేళ్ల త‌ర్వాత తాను పెళ్లి చేసుకుంటానంటూ విచిత్ర‌మైన స‌మాధానం ఒక‌టి ఇచ్చింది ఏక్తా. అంటే జీవితంలో తాను పెళ్లి చేసుకోన‌ని ఇన్ డైరెక్ట్ గా చెప్పేసింది ఈమె. జీవితం మొత్తం ఇలాగే బ్ర‌హ్మ‌చారిణిగా ఉండిపోతానంటుంది. లేక‌పోతే మ‌రేంటి.. స‌ల్మాన్ పెళ్లి చేసుకోడ‌ని తెలుసు క‌దా..! మ‌ళ్లీ ఆయ‌న పెళ్లితో ఈమె లింక్ పెట్టుకోవ‌డం ఎందుకు..? ఒక‌వేళ చేసుకునే ఉద్ధేశ్యం ఉంటే చేసుకుంటాన‌నో.. త‌ర్వాత చేసుకుంటాన‌నో చెప్పాలి కానీ స‌ల్మాన్ పెళ్లి చేసుకున్న త‌ర్వాత చేసుకుంటాన‌ని పిచ్చి స‌మాధానం చెప్ప‌డం ఎందుకు అంటున్నారు అభిమానులు. అయినా అబ్బాయిల‌కే 30 దాటితే పిల్ల‌నివ్వ‌డం లేదు.. ఇక ఇప్పుడు ఈమె 40 దాటేసింది.. ఈమెను చేసుకోడానికి వ‌రుడు దొరుకుతాడో లేదో..?

User Comments