కోర్టు మెట్లెక్కిన హీరోయిన్

Last Updated on by

యామీగౌత‌మ్ ఏంటి.. కోర్టు మెట్లు ఎక్క‌డం ఏంటి..? ఆవిడ ఏం నేరం చేసింది..? అయినా ఈ మ‌ధ్య బాలీవుడ్ వాళ్ల‌కు కోర్టు బాగా స‌ర‌దా వ్య‌వ‌హారం అయిపోయింది క‌దా అనుకుంటున్నారా..? అవును.. ఇప్పుడు యామీగౌత‌మ్ కూడా ఆ స‌ర‌దా కోసమే కోర్టు మెట్లు ఎక్కింది. అది కూడా చిన్న కోర్ట్ కాదు.. ఏకంగా ముంబై హైకోర్ట్. అవును.. ఈ మ‌ధ్య త‌రుచూ అక్క‌డే త‌చ్చాడుతుంది యామీ.
yami gautam spotted outside bombay high court
దీనికి కార‌ణం కూడా ఉంది.. ఈమె ఏదో నేరం గీరం చేయ‌లేదు కానీ ప్ర‌స్తుతం ఈమె న‌టిస్తున్న బ‌ట్టి గుల్ మీట‌ర్ చాలూ సినిమా కోస‌మే ఇప్పుడు కోర్టుల చుట్టూ ప్ర‌ద‌క్ష‌ణ‌లు చేస్తుంది. ఈ సినిమాలో యామీ లాయ‌ర్ పాత్ర‌లో న‌టిస్తుంది. అందుకే అక్క‌డ ఒరిజిన‌ల్ లాయ‌ర్లు ఎలా ఉంటారో ఓ క‌న్నేస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. పాత్ర‌ను అర్థం చేసుకునే క్ర‌మంలోనే  మాటిమాటికి కోర్టు మెట్లు ఎక్కాల్సి వ‌స్తుంద‌న్న‌మాట‌. మొత్తానికి ప‌ర్లేదులెండి.. అందాలే కాదు అప్పుడ‌ప్పుడూ అభిన‌యంపై కూడా ఫోక‌స్ పెడుతున్నారు బాలీవుడ్ హీరోయిన్లు. ఇది కూడా మంచికే.

User Comments