`యాత్ర` మూవీ రివ్యూ

Last Updated on by

న‌టీన‌టులు: మ‌మ్ముట్టి, సుహాసిని మ‌ణిర‌త్నం, జ‌గ‌ప‌తిబాబు అన‌సూయ‌ త‌దిత‌రులు

బ్యాన‌ర్‌:70 యంయం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్
నిర్మాత‌: విజ‌య్ చిల్లా, శ‌శిదేవి రెడ్డి
సంగీతం: కె.కృష్ణ‌మూర్తి
కెమెరా: స‌త్య‌న్ సూర్య‌న్
ఎడిటింగ్‌: శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్
ద‌ర్శ‌క‌త్వం: మ‌హి.వి.రాఘ‌వ్
రిలీజ్ తేదీ: 08-02-2019

ముందు మాట‌:
బ‌యోపిక్ ల ట్రెండ్ లో రాజ‌కీయ నాయ‌కుల బ‌యోపిక్ ల‌పై ప్ర‌జ‌ల్లో ఆస‌క్తి నెల‌కొంది. ఆ క్ర‌మంలోనే ఎన్టీఆర్ బ‌యోపిక్ క‌థానాయ‌కుడు రిలీజైంది. ఈ సిరీస్ లో పార్ట్ 2 మ‌హానాయ‌కుడు జ‌నం ముందుకు వ‌స్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ త‌ర్వాత ఒక నాయ‌కుడిగా అంత‌టి ఇమేజ్ సంపాదించుకున్న దివంగ‌త ముఖ్య‌మంత్రి డా.వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి బ‌యోపిక్ నేడు ప్ర‌పంచవ్యాప్తంగా దాదాపు 970 స్క్రీన్ల‌లో రిలీజ‌వుతోంది. కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లో 500 థియేట‌ర్ల‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఓవ‌ర్సీస్ లో 180 స్క్రీన్ల‌లో సినిమా రిలీజ‌వుతోంది. ఇది వైయ‌స్ జీవిత‌క‌థ కాదు.. వైయ‌స్ జీవితంలోని కీల‌క‌మైన పాద యాత్ర చుట్టూ తిరిగే క‌థాంశం.. ఒక నాయ‌కుడి ఎమోష‌న‌ల్ జ‌ర్నీ మాత్ర‌మే.. రాజ‌కీయాలు కానే కాదు అని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇంట‌ర్వ్యూల్లో చెప్పారు. రిలీజ్ ముందే ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమా కోసం ఇటు వైయ‌స్సార్ – వైయ‌స్ జ‌గ‌న్ అభిమానుల‌తో పాటు, అటు ఎన్టీఆర్- నంద‌మూరి అభిమానులు అంతే ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక రాజ‌కీయ నాయ‌కుడి బ‌యోపిక్ కాబ‌ట్టి ఇందులో ఏం ఉంటుందో చూడాల‌న్న ఉత్కంఠ అంద‌రిలో నెల‌కొంది. అస‌లు యాత్ర చిత్రం ఏ కోణంలో తెర‌కెక్కింది? మేక‌ర్స్ చెప్పిన‌ట్టు ఇందులో ఎమోష‌న్ ఎంత‌? అస‌లు క‌థేమిటో తెలియాలంటే స‌మీక్ష‌లోకి వెళ్లాల్సిందే.

క‌థ‌:
పేద‌ల జీవితాల్లో క‌ష్టాలు, క‌న్నీళ్లు తెలుసుకునేందుకు కాంగ్రెస్ నాయ‌కుడు వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి (మ‌మ్ముట్టి) సాగించిన పాద యాత్ర లోని ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాల‌కు సంబంధించిన క‌థాంశ‌మిది. సినిమా ఎత్తుగ‌డే అస‌లు వైయ‌స్ పాద యాత్ర‌కు ఎందుకు సంక‌ల్పించారు? అన్న పాయింట్ తో ప్రారంభం అవుతుంది. వైయ‌స్సార్ ఫోటోల స్క్రోలింగ్ తో స్క్రీన్ పై టైటిల్స్ ప‌డ‌తాయి. ఆ త‌ర్వాత ఒక పేద‌రాలు అయిన అన‌సూయ తాను న‌మ్మిన నాయ‌కుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డికి త‌న క‌ష్టాన్ని చెప్పుకుంటుంది. త‌న‌కు అత‌డి సాయం అందుతుంది. క‌డ‌ప‌లో త‌మ ఇలాకాలో రాజ‌శేఖ‌రుడు ప్ర‌జ‌ల‌కు దేవుడు. వైయ‌స్ త‌న ఆత్మ కెవిపి (రావు ర‌మేష్) అండ‌దండ‌ల‌తో త‌న రాజ‌కీయ జీవితంలో ఎన్నో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటారు. తెలుగు వారిపై కేంద్రం పెత్త‌నం గిట్ట‌ని రాజ‌శేఖ‌రుడు హైక‌మాండ్ (కాంగ్రెస్)నే ఎదురిస్తాడు. ఆ క్ర‌మంలోనే ప్ర‌జా జీవ‌నం తెలుసుకునేందుకు త‌న జీవితంలో కీల‌క‌మైన పాద యాత్ర కు సంక‌ల్పిస్తాడు. తెలుగు ప్ర‌జ‌ల్ని, రైత‌న్న‌ల‌ను క‌లిసేందుకు పాద‌యాత్ర నిర్ణ‌యం తీసుకుని అటుపై పేద‌ల్ని క‌లుస్తూ, వారి స‌మ‌స్య‌ల్ని అర్థం చేసుకుంటూ సాగించిన ప‌యనంలో .. ఆ దారిలో ఏం జ‌రిగింది? అన్న‌ది ఉద్విగ్న‌మైన‌ది. తాను వెళ్లే దారిలో ఎన్నో ముల్లుంటాయి. క‌ష్ట‌న‌ష్టాలుంటాయి. కాలి న‌డ‌క‌కు ఆరోగ్యం స‌హ‌క‌రించ‌దు… ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయాలు తంటాలు తెస్తాయి.. అరెస్టు చేయించే కుట్ర జ‌రుగుతుంది. అయినా వెన్ను వంచ‌క ప్ర‌జ‌ల కోసం తాను చేయాల్సిన‌ది చేస్తారు రాజ‌శేఖ‌ర్ రెడ్డి. రైత‌న్న‌ల‌కు ఉచిత క‌రెంట్ ప్రామిస్ ని చేస్తారు. పార్టీలోనే వెన్ను పోటు దారులు, ఫిరాయింపు రాజ‌కీయాలు అన్నిటినీ త‌ట్టుకుని చివ‌రికి ప్ర‌జ‌ల‌కు తాను చేసిన ప్రామిస్ కి ప్ర‌తిఫ‌లంగా ఎన్నిక‌ల్లో అసాధార‌ణ విజ‌యం ద‌క్కుతుంది. 294 సీట్ల‌లో 185 సీట్ల‌ను గెలుచుకుని వైయ‌స్ సీఎం అవుతారు. ఆ త‌ర్వాత రైత‌న్న‌ల‌కు ఉచిత క‌రెంట్ ఫైల్ పై తొలి సంత‌కం చేసి పాల‌న సాగిస్తారు. చివ‌రిగా హెలీకాఫ్ట‌ర్ కూలి వైయ‌స్ మ‌ర‌ణ వార్త సంచ‌ల‌నం అవ్వ‌డంతో సినిమా ముగుస్తుంది. ఇక ఈ క‌థ‌లో వైయ‌స్ కి త‌న తండ్రి రాజ‌న్న స్ఫూర్తి ఏంటి? అన్న‌ది తెర‌పైనే చూడాలి.

న‌టీన‌టులు:
మ‌మ్ముట్టి త‌న పాత్ర‌కు వంద శాతం న్యాయం చేశారు. 30 ఇయ‌ర్స్ పృథ్వీ, పోసాని న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. రాజారెడ్డిగా జ‌గ‌ప‌తిబాబు న‌ట‌న మ‌రిపిస్తుంది. సంజ‌య్ స్వ‌రూప్, నాగినీడు సీన్స్ ఓకే. మ‌రుగైనావ రాజ‌న్న‌.. నీ రాక కోసం పాట‌లు ఎమోష‌న‌ల్..

ప్ల‌స్ పాయింట్స్
*మ‌మ్ముట్టి న‌ట‌న‌. ఆయ‌న‌ ఈ చిత్రానికి 100 శాతం ప్ల‌స్. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాత్ర‌కు యాప్ట్.
*వైయ‌స్సార్ హార్డ్ కోర్‌ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చే సీన్స్ హైలైట్
* పాట‌లు

మైన‌స్ పాయింట్స్‌
*టీడీపీని నెగెటివ్ గా చూపించ‌డం
*రెగ్యుల‌ర్ ఆడియెన్ కి క‌నెక్ట్ చేయ‌లేక‌పోవ‌డం..
*డాక్యుమెంట‌రీని త‌ల‌పించ‌డం..

సాంకేతిక వ‌ర్గం
సాంకేతికంగా ఈ చిత్రాన్ని నాణ్యంగానే చూపించారు. నిర్మాణ విలువ‌లు ఆక‌ట్టుకున్నాయి. కెమెరా, సంగీతం ప్ల‌స్. పాట‌ల్లో ఎమోష‌న్ ఆక‌ట్టుకుంది. ద‌ర్శ‌కుడిగా, ర‌చ‌యిత‌గా మ‌హి.వి.రాఘ‌వ్ మెప్పించాడు.

చివ‌ర‌గా:
`యాత్ర` వైయ‌స్ అభిమానుల కోసం మాత్ర‌మే..

రేటింగ్‌:
2.5/5.0

 

Also Read : Yatra English Review

Also Read: Yatra USA Live Collections

User Comments