టీజ‌ర్‌: ప్రామిస్సింగ్ `యాత్ర‌`

Last Updated on by

వైయ‌స్సార్ పాదయాత్ర‌ను, ఆయ‌న జీవితాన్ని బేస్ చేసుకుని రూపొందిస్తున్న `యాత్ర‌` ప్ర‌స్తుతం ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు స‌హా వైయ‌స్ అభిమానుల్లోనూ హాట్ టాపిక్‌. మ‌హి.వి.రాఘ‌వ్ బృందం ఈ చిత్రాన్ని ఎంత ప్రామిస్సింగ్‌గా రూపొందిస్తుందో చూడాల‌న్న త‌హ‌త‌హ వైయ‌స్ అభిమానుల్లో ఉంది. ఈ చిత్రానికి వైకాపా నేత‌లే పెట్టుబ‌డులు పెడుతుండ‌డంతో మ‌రింత ఆస‌క్తి రెయిజ్ అయ్యింది. టైటిల్ పాత్ర‌లో మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి న‌టిస్తుండ‌డం సినిమాకి పెద్ద ప్ల‌స్‌. ఇదివ‌ర‌కూ రిలీజైన ఫ‌స్ట్‌లుక్‌ పోస్ట‌ర్‌కి అద్భుత స్పంద‌న ల‌భించింది. శివ మేక స‌మ‌ర్ప‌ణ‌లో 70ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

తాజాగా ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్ రిలీజైంది. ఈ టీజ‌ర్‌లో వైయ‌స్సార్ పాద‌యాత్ర ప్రారంభంలో స‌వాల్‌ని అద్భుతంగా ఎలివేట్ చేశారు. తెలుసుకోవాల‌నుంది.. వినాల‌ని ఉంది.. ఈ క‌డ‌ప దాటి ప్ర‌తీ గ‌డ‌ప‌కు వెళ్లాల‌నుంది.. వాళ్ల‌తో క‌లిసి న‌డ‌వాల‌నుంది… వాళ్ల గుండె చ‌ప్పుడు వినాల‌ని ఉంది… గెలిస్తే ప‌ట్టుద‌ల అంటారు…. ఓడిపోతే మూర్ఖ‌త్వం అంటారు. ఈ పాద‌యాత్ర నా మూర్ఖ‌త్వ‌మో.. ప‌ట్టుద‌లో చ‌రిత్ర‌నే నిర్ణ‌యించ‌బోతోంది.. అంటూ వినిపించిన డైలాగ్ అభిమానుల గుండెల్లో మార్మోగుతోంది. వైయ‌స్ మొండి ప‌ట్టుద‌ల‌ను ఈ డైలాగ్ ఆవిష్క‌రించింది. టీజ‌ర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అల్టిమేట్‌. అయితే టీజ‌ర్ ఓకే కానీ డ‌బ్బింగ్ నాట్ ఓకే. అది డ‌బ్బింగ్ అని తెలిసిపోతోంది. వైయ‌స్ గొంతు మిమిక్రీ చేయించి ఉంటే బావుండేదేమో? అన్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అయితే అన్నిటికీ మ‌హి.వి.రాఘ‌వ్ క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌.

User Comments