ఎమ్మెల్యే రోజా అల‌క‌పానుపు?

Last Updated on by

ఏపీలో వైఎస్‌.జగన్ మంత్రివర్గంలో ఖచ్చితంగా స్థానం దక్కుతుందని ఆశించిన వారిలో కొందరికి షాకులు తప్పలేదు. వీరిలో కొందరు సీనియర్లు ఉంటే.. మరికొందరు జూనియర్లు కూడా ఉన్నారు. జగన్ కోసం ముందు నుంచి కష్టపడిన వారిలో కూడా కొందరికి మంత్రి పదవులు రాలేదు. అయితే సామాజిక, ప్రాంతీయ సమీకరణల సమతుల్యత నేపథ్యంలో కొందరికి మంత్రి పదవులు రాకపోయినా… వారికి వచ్చే రెండున్నరేళ్ల తర్వాత అవకాశం కల్పిస్తామని కూడా జగన్ హామీ ఇచ్చారు. అయితే మంత్రి పదవి రాని వారిలో కొందరు ఇప్పటికే అలక బూనినట్టు తెలుస్తోంది. వీరిలో వైసీపీ ఫైర్ బ్రాండ్‌, లేడీ ఎమ్మెల్యే ఆర్‌కె.రోజా కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

నగరి నుంచి వరుసగా రెండోసారి గెలిచిన రోజా తనకు తప్పకుండా కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించారు. కానీ సీన్ రివ‌ర్స్ అయింది. రెండేళ్ల త‌ర్వాత మంత్రి వ‌ర్గంలో మ‌ళ్లీ మార్పులు జ‌రుగుతాయి కాబ‌ట్టి…జ‌గ‌న్ ద‌య‌త‌లిస్తే రోజాకు అప్పుడు వ‌చ్చే అవ‌కాశం ఉంది. లేదంట్లే రాట‌న్లే. అయితే రోజా విషయంలో మ‌రో రూమ‌ర్ వినిపిస్తోంది. ఆమె కు నోరు ఎక్కువ‌ని… ఏ విష‌యంపైనైనా ఊర‌క‌నే నోర జారుతుంద‌నే కారణంగాను జ‌గ‌న్ ప‌క్క‌న‌బెట్టాడ‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.


Related Posts