కోటిన్న‌ర కొట్టేసిన చేప‌లు

Yedu Chepala Katha - File Photo

బూతు.. ఎరోటిక్ అంటూ క్రిటిక్స్ నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నా ఏడు చేప‌ల క‌థ వ‌సూళ్లు షాకిస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ మొదటి షో కే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ యూత్ లో ఉన్న క్రేజ్ తో అల్టిమేట్ కలెక్షన్స్ ని మొదటి రోజు అందుకుంది. 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే ఏకంగా 1.06 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకోగా.. వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 1.13 కోట్ల షేర్ ని సాధించి బాక్సాఫీస్ దగ్గర షాకింగ్ ఓపెనింగ్స్ ని అందుకుని సంచలనం సృష్టించింది, సినిమా మొదటి రోజు ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలను ప‌రిశీలిస్తే..

నైజాం- 38L, సీడెడ్- 21L, ఉత్త‌రాంధ్ర‌- 13L, తూ.గో జిల్లా- 8L, ప‌.గో జిల్లా- 6.5L, గుంటూరు- 7L, కృష్ణ‌- 7.4L, నెల్లూరు- 5L వ‌సూలైంది. ఏపీ టీజీ -1.06కోట్లు.. క‌ర్నాట‌క ఇత‌ర ఇండియా క‌లిపి 5ల‌క్ష‌లు వ‌సైల‌వ్వ‌గా ఓవ‌ర్సీస్ నుంచి 2ల‌క్ష‌లు తెచ్చింది.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1.13 కోట్ల షేర్ .. 1.9 కోట్ల గ్రాస్ వ‌సూలు చేసింది.

ఈ సినిమాను రెండు రాష్ట్రాలలో 1.4 కోట్లకు అమ్మగా వరల్డ్ వైడ్ గా 1.7 కోట్లకు అమ్మారు. దాంతో 2.2 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజే సగానికి పైగా రికవరీ చేయగా వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. టాక్ తేడా గా ఉన్నా కలెక్షన్స్ మాత్రం భారీ గా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.