ఏడు చేప‌ల క‌థ రివ్యూ

Yedu Chepala Katha Review - File Photo

నటీనటులు : అభిషేక్, భాను శ్రీ, మేఘనా చౌదరి, ఆయేషా సింగ్, సునీల్ కుమార్ త‌దిత‌రులు
రిలీజ్ తేదీ : 7 నవంబర్ 2019
నిర్మాత‌లు : జీవిఎన్ శేఖర్ రెడ్డి
సంగీతం : కవి శంకర్
దర్శకత్వం : శ్యామ్ జె చైతన్య

ముందు మాట‌:
ఎంచుకున్న కంటెంట్ లో వేడెక్కించే వ్య‌వ‌హారం ఉంటే అటెన్ష‌న్ క్రియేట్ చేయొచ్చు అన‌డానికి ఈ సినిమా ఎగ్జాంపుల్. ప్ర‌చారంతోనే అస‌లు ఇలాంటి ఒక సినిమా ఉంద‌ని యూత్ కి తెలిసింది. అభిషేక్ పచ్చిపాల-భాను శ్రీ జంట‌గా శ్యామ్ జె చైతన్య దర్శకత్వం వ‌హించిన `ఏడు చేపల కథ` నేడు థియేటర్ల‌లోకి విడుద‌లైంది. ఈ సినిమాపై ప్రేక్ష‌క మ‌హాశ‌యులకు న‌చ్చిందా లేదా.. యూత్ ఏమంటున్నారు? అన్న‌ది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

క‌థా క‌మామీషు:
రవి .. సుంద‌రం అనే ఇద్ద‌రు సెక్స్ బానిస‌ల క‌థ ఇది. టెంప్ట్ రవి (అభిషేక్ పచ్చిపాల) తలసీమియా అనే ప్ర‌మాద‌క‌ర రుగ్మ‌త‌తో పెయిన్ అనుభ‌విస్తున్నా.. అంద‌గ‌త్తెను చూస్తే టెంప్ట్ అయిపోతుంటాడు. అత‌డికి కూడా అమ్మాయిలు అలానే ఆక‌ర్షితులు అవుతుంటారు. త‌న‌తో పాటే సుంద‌రం సెక్స్ బ‌ల‌హీన‌త కార‌ణంగా ఆత్మ‌ల‌తో రొమాన్స్ చేస్తుంటాడు. ఆ ఇద్ద‌రి క‌థ‌లో ప్రేయ‌సి మ్యాట‌రేమిటి? ఇత‌ర‌త్రా సంఘ‌ట‌న‌ల స‌మాహారం ఏమిటి? అన్న‌దే ఈ సినిమా.

ర‌క్తం ఎక్కించ‌క‌పోతే పోతాడు! అన్న సీరియ‌స్ ఎలిమెంట్ కి రొమాంటిక్ యాంగిల్ ని జోడించి క్రియేటివ్ గానే ఆలోచించారు. అలాగే ఆత్మ‌ల‌తో రొమాన్స్ చేసే శాడిస్ట్ అన్న పాయింట్ ఇంట్రెస్టింగ్. అయితే ఈ సినిమాని తెర‌కెక్కించిన విధాన‌మే అత్యంత పేల‌వం. ఇక ఇందులో లెక్క‌కు మిక్కిలి యూత్ ని గిలిగింత‌లు పెట్టే ప‌చ్చి బూతు రొమాన్స్ బూతు డైలాగులు.. ద్వంద్వార్థ డైలాగుల‌తో డీగ్రేడ్ సినిమాగా స్ట్రైక్ అవుతుంది. ఇక దీనికి సెన్సార్ క‌టింగ్స్ తో అత్యంత హీనంగా యూట్యూబ్ షార్ట్ ఫిలిం కంటే దారుణంగా త‌యారైంది. ఏడు చేప‌లు టైటిల్ కి త‌గ్గ‌ట్టే అందాలు ఆర‌బోయ‌డంలో అమ్మాయిలు రెచ్చిపోయిన తీరు బ‌హుశా డీగ్రేడ్ మాస్ జ‌నాల‌కు క‌నెక్ట‌వుతుంది. అయితే ఇది సినిమా అన్న భావ‌న‌ను వ‌దిలేసి థియేట‌ర్ల‌కు వెళ్లాల్సి ఉంటుంది.

న‌టీన‌టులు.. టెక్నీషియ‌న్స్:
ర‌వి పాత్ర‌ధారి ఈజ్ ఉన్న న‌ట‌న‌.. క‌థానాయిక‌లు చేప‌ల‌కు ప్ర‌తిరూపాలే కావ‌డం ఓకే. ఇక నిర్మాణ విలువ‌లు ఏమాత్రం లేని ఈ సినిమాలో కెమెరా, సంగీతం, ఎడిటింగ్ అన్నీ సోసోనే.

ప్ల‌స్ పాయింట్స్:
* అభిషేక్ ప‌చ్చి పాల న‌ట‌న‌
* సైక‌లాజిక‌ల్ ఎరోటిక్ థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్
* కొన్ని ఎగ్జ‌యిటింగ్ యూత్ ఎలిమెంట్స్

మైన‌స్ పాయింట్స్
* అడ‌ల్ట్ కంటెంట్ .. బిత్త‌ర‌పోయే బూతు
* స్లో నేరేష‌న్.. క‌థ లేక‌పోవ‌డం.. సంబంధం లేని అంశాలు..
* స‌హ‌జ విరుద్ధ‌మైన పాత్ర‌లు

ముగింపు:
ల‌స్ట్ కాదు కానీ వ‌ర‌స్ట్ స్టోరీస్

రేటింగ్:
0.5/ 5