కెరీర్ ఆరంభమే హిట్టు కొట్టడంతో వెల్లువలా అవకాశాలొచ్చాయి. దాంతో క్షణం తీరిక లేకుండా హీరోయిన్ గా వెలిగిపోయింది సదరు యంగ్ బ్యూటీ. టైమ్ ఎప్పుడూ ఒకలానే నడవదు కదా.. ఆ క్రమంలోనే కొన్ని వరుస ఫ్లాప్ లు ఎదురయ్యాయి. అయితే తనతో కెరీర్ ఆరంభమే బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన సదరు యంగ్ హీరోతో ఈ అమ్మడు ఎఫైర్ సాగించిందని ప్రచారమైంది. ఆ ఇద్దరి ర్యాపో గురించి టాలీవుడ్ సర్కిల్స్ లో కొన్నాళ్లు గుసగుసలు వినిపించాయి. యువ హీరో వల్ల తనకు కొందరు నిర్మాతల వద్ద రికమండేషన్లు .. దాంతోనే అడ్వాన్సులు అందాయి.
తనకు అవకాశాలు వచ్చేలా.. కాస్తంత ఆర్థికంగా కుదుటపడేలా సాయం చేసిన సదరు యంగ్ హీరోకి ఎందుకనో అనూహ్యంగా బ్యాడ్ టైమ్ స్టార్టయ్యింది. పాకెట్ మనీ కూడా మ్యానేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. అయితే తాను సాయం చేసిన అమ్మడు కష్టంలో సాయపడుతుందని అనుకుంటే సదరు కుర్ర బ్యూటీ టైమ్ చూసి పెద్ద హ్యాండిచ్చిందట. దీంతో ఆ యంగ్ హీరో హర్టయ్యి తనకు దూరంగా ఉంటున్నాడన్నది ఇండస్ట్రీలో గుసగుస. ఇంతకీ ఎవరా కుర్ర బ్యూటీ.. ఎవరా యంగ్ హీరో అన్నది కనిపెట్టండి మీరే.
ఒక చిన్న క్లూ ప్లీజ్ అంటారా? అయితే ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో ఓ మాట చెప్పింది. “నేను ప్రేమలో పడిన మాట వాస్తవమే కానీ..ఆ హీరోతో కాదు.. ఇండస్ట్రీ బయటి వ్యక్తితో డేటింగ్ చేశా. అతడి సహకారం తోనే ఈ స్థాయి కి ఎదిగాను. దీని గురించి మా ఇంట్లో కూడా తెలుసు. పాపం ఆ కుర్ర హీరోని వదిలేయండి ప్లీజ్“ అని అంది ఈ గడుసరి.